ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యంగా రాహుల్ గాంధీ విమర్శలు ఎక్కుపెట్టారు. జీడీపీ ప్రతికూల పథంలో పయనిస్తోందని, నిరుద్యోగం తీవ్రస్థాయికి చేరిందని పేర్కొన్నారు. 'ప్రధాని హాల్ ఆఫ్ షేమ్- కనిష్ఠ జీడీపీ, గరిష్ఠ నిరుద్యోగం' అంటూ నిరుద్యోగానికి సంబంధించిన గ్రాఫ్‌ను ట్వీట్ చేశారు రాహుల్.
మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి మైనస్ 7.3 శాతంగా నమోదైన నేపథ్యంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. జనవరి-మార్చి త్రైమాసికంలో జీడీపీ 1.6 శాతం వృద్ధి సాధించింది.