తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'భారత్​కు అవసరమైతే.. కోరినన్ని రఫేల్​ జెట్లు అందిస్తాం' - Rafale Deal Between India and France

Rafale Fighter Jets: రఫేల్​ యుద్ధ విమానాలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు ఫ్రాన్స్​ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్​ పార్లే. భారత్​ కోరితే మరిన్ని రఫేల్​ జెట్లు ఇచ్చేందుకు తాము సిద్ధమేనని స్పష్టం చేశారు. మేక్​ ఇన్​ ఇండియాకు ఫ్రాన్స్​ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు.

France ready to offer more Rafale to India
France ready to offer more Rafale to India

By

Published : Dec 17, 2021, 5:03 PM IST

Updated : Dec 17, 2021, 6:05 PM IST

Rafale Fighter Jets: భారత్​ అవసరాల మేరకు మరిన్ని రఫేల్​ జెట్లు అందించేందుకు ఫ్రాన్స్​ సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు ఆ దేశ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్​ పార్లే. భారత్​, ఫ్రాన్స్​ ఒకే రకమైన ఆయుధాలు వినియోగించడం రెండు వ్యూహాత్మక భాగస్వామ్య దేశాల బలమైన బంధానికి అద్దం పడుతోందని ఆమె అన్నారు.

భారత్​-ఫ్రాన్స్​ సహకారంపై దిల్లీలో అనంత సెంటర్ నిర్వహించిన ఇంటరాక్టివ్​ సెషన్​లో పార్లే ఈ వ్యాఖ్యలు చేశారు.

మేక్​ ఇన్​ ఇండియాకు మద్దతు ఇచ్చేందుకు ఫ్రాన్స్​ కట్టుబడి ఉన్నట్లు ఫ్లోరెన్స్ స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా భారతీయ ఉత్పత్తులకు ప్రోత్సాహం కల్పించనున్నట్లు పేర్కొన్నారు.

''రఫేల్​ జెట్లతో భారత వాయుసేన సంతృప్తిగా ఉండటం పట్ల ఆనందంగా ఉంది. కరోనా సంక్లిష్ట సమయంలోనూ అనుకున్న సమయానికే 36 యుద్ధవిమానాలు భారత్​కు అందించాం. ఇదో గొప్ప ఘనత.''

- ఫ్లోరెన్స్​ పార్లే, ఫ్రాన్స్​ రక్షణ మంత్రి

భారత్​కు ఇప్పటివరకు 33 రఫేల్​ జెట్లు అందించినట్లు ఫ్రాన్స్​ రాయబార కార్యాలయం గురువారం తెలిపింది.

Rafale Deal Between India and France

ఫ్రాన్స్​ నుంచి 36 రఫేల్​ యుద్ధ విమానాల కొనుగోలుకు రూ.59వేల కోట్ల విలువైన ఒప్పందం 2016 సెప్టెంబర్​లో చేసుకుంది భారత్​. విమానాలను ఫ్రాన్స్​కు చెందిన దసో ఏవియేషన్​ సంస్థ తయారు చేస్తోంది. సుమారు నాలుగేళ్ల తర్వాత గతేడాది జులై 29న తొలి బ్యాచ్​లో 5 రఫేల్​లు భారత్​కు చేరుకున్నాయి. సెప్టెంబర్​ 10న వాయుసేన అమ్ములపొదిలో చేరాయి.

రెండో బ్యాచ్​ 2020, నవంబర్​ 3న మూడు రఫేల్​లు భారత్​కు చేరుకున్నాయి. మూడో బ్యాచ్​లో మరో 3 రఫేల్​లు 2021, జనవరి 27న వాయుసేనలో చేరాయి.

తొలి రఫేల్​ స్క్వాడ్రాన్​ను హరియాణాలోని అంబాలాలో ఏర్పాటు చేశారు. రెండో స్క్వాడ్రాన్​ను బంగాల్​లోని బసిమారాలో ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు చేస్తోంది వాయుసేన.

Rafale Deal Corruption

భారత్​లోనూ రఫేల్​ ఒప్పందం రాజకీయ వివాదంగా మారింది. ఇప్పటికీ మోదీ సర్కార్​పై విపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ ఈ అంశంపై​ విమర్శనాస్త్రాలు సంధిస్తూనే ఉన్నాయి. ఈ వ్యవహారంపై పార్లమెంటులోనూ దుమారం చెలరేగింది. సుప్రీంకోర్టులోనూ రఫేల్​ ఒప్పందానికి సంబంధించి పలు పిటిషన్లు దాఖలయ్యాయి.

భారత్​తో రఫేల్​ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం కుదిరేలా చూసేందుకు.. దసో ఏవియేషన్​ సంస్థ భారీగా ముడుపులు ఇచ్చిందంటూ ఫ్రాన్స్​కు చెందిన 'మీడియాపార్ట్​' జర్నల్​ నవంబర్​లో సంచలన వార్త ప్రచురించింది. ఇందుకోసం బోగస్ ఇన్​వాయిస్​లు రూపొందించిందని వెల్లడించింది. దసో ఏవియేషన్​.. ఓ మధ్యవర్తికి 7.5 మిలియన్​ యూరోల(రూ. 64.32కోట్లు) ముడుపులను రహస్యంగా అందించేందుకు ఈ ఇన్​వాయిస్​లు ఉపయోగపడ్డాయని ఆరోపించింది. బోగస్​ ఇన్​వాయిస్​కు సంబంధించిన పత్రాలు అందుబాటులో ఉన్నప్పటికీ, భారత దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టలేదని మీడియాపార్ట్​ ఆరోపించింది.

మోదీ, రాజ్​నాథ్​తో భేటీ..

ఫ్లోరెన్స్​ పార్లే ఈ రోజు ఉదయం భారత ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.

మోదీతో సమావేశమైన పార్లే

అనంతరం.. రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​తో సమావేశం అయ్యారు.

భారత రక్షణ మంత్రి రాజ్​నాథ్​తో సమావేశమైన పార్లే బృందం

భారత్​- ఫ్రాన్స్​ బంధం మరింత బలంగా తయారైందని అన్నారు రాజ్​నాథ్​. భారత్​- ఫ్రాన్స్​ ద్వైపాక్షిక, ప్రాంతీయ, రక్షణ సంబంధిత అంశాలపై విస్తృత చర్చలు జరిపినట్లు ఆయన పేర్కొన్నారు.

ఇవీ చూడండి: రఫేల్​: ఒప్పందమా? కుంభకోణమా?? అసలేం జరిగింది???

గంటకు 900కి.మీ వేగంతో 'రఫేల్' గర్జన

Last Updated : Dec 17, 2021, 6:05 PM IST

ABOUT THE AUTHOR

...view details