Puri Temple crime news:ప్రఖ్యాత పుణ్యక్షేత్రం పూరీలో అమానుష ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. పూరీ జగన్నాథ మందిరానికి వచ్చిన ఓ బాలుడిపై ఓ సీనియర్ పూజారి (63) లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన రెండు నెలల క్రితం జరిగింది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
Puri Sexual harassment:
బాధిత బాలుడు మరో పూజారి కుమారుడు అని పోలీసులు తెలిపారు. బాధితుడికి అంధత్వం ఉందని చెప్పారు. మందిర ఆవరణలోనే నిందితుడు.. బాలుడిపై వేధింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదు అందినట్లు వెల్లడించారు. ఐపీసీ, పోక్సో చట్టం ప్రకారం అభియోగాలు మోపినట్లు సింఘద్వార్ పోలీస్ స్టేషన్ ఇంఛార్జి ఇన్స్పెక్టర్ సునీల్ కుమార్ తెలిపారు.
Servitor Sexual harassment:
ఫిర్యాదులో ఉన్న వివరాల ప్రకారం.. బాలుడు తన తండ్రితో కలిసి ప్రతిరోజు మందిరానికి వెళ్లేవాడు. ఈ క్రమంలోనే ఓ రోజు గుడికి వెళ్లగా.. పూజారి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అంతేకాక, శారీరకంగా హింసిస్తానని బాలుడిని హెచ్చరించేవాడు. బాలుడి తండ్రి మరో గుడిలో దర్శనానికి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది.
పూరీలోనే మరిన్ని..
అక్టోబర్‌లోనూ ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. పూరీ ఆలయంలో బాలికపై పూజారే లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో నిందితుడిని అరెస్టు చేశారు.
అటు, గురువారం సైతం ఓ పూజారి బాలికను వేధించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన సైతం పూరీ ఆలయ ఆవరణలోనే జరగడం ఆందోళన కలిగిస్తోంది.
ఇదీ చదవండి:కెప్టెన్ వరుణ్ సింగ్ కోలుకోవాలంటూ.. సైకత శిల్పం