Punjab Politics TV: విదేశాల నుంచి పనిచేస్తున్న 'పంజాబ్ పాలిటిక్స్ టీవీ'పై కేంద్రం కఠిన చర్యలు తీసుకుంది. ఈ సంస్థకు చెందిన యాప్‌లు, వెబ్సైట్, సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేయాలని కేంద్ర సమాచార, ప్రసార శాఖ ఆదేశాలు జారీ చేసింది. వేర్పాటువాద సంస్థ 'సిక్స్ ఫర్ జస్టిస్'తో ఈ సంస్థకు దగ్గరి సంబంధాలు ఉన్న నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకుంది.
Punjab Politics TV banned
రాష్ట్ర ఎన్నికల సమయంలో ఈ ఛానెల్ తప్పుడు వార్తలు ప్రసారం చేసిందని నిఘా వర్గాలు తెలిపాయని కేంద్రం తెలిపింది. ఆన్లైన్ మీడియాను ఉపయోగించుకొని శాంతి, భద్రతలకు భంగం కలిగించేందుకు ప్రయత్నించిందని వెల్లడించింది. ఐటీ రూల్స్‌లో ఉన్న అత్యవసర అధికారాలను ఉపయోగించి పంజాబ్ పాలిటిక్స్ టీవీపై నిషేధం విధించిందని వివరించింది.
ఫిబ్రవరి 20న పంజాబ్ ఎన్నికలు జరిగాయి. ఒకే విడతలో రాష్ట్రంలోని 117 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి.
ఇదీ చదవండి:పగబట్టిన కాకులు.. మనుషులపై దాడి!