మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పంజాబ్‌లో రాజకీయాలు(Punjab politics) శరవేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్‌తో సుదీర్ఘ అనుబంధానికి తెరదించుతూ ఆ పార్టీ నుంచి బయటకొచ్చిన మాజీ సీఎం, సీనియర్ నేత కెప్టెన్ అమరీందర్ సింగ్(amarinder singh news) కొత్త పార్టీని(amarinder singh new party) స్థాపించేందుకు సిద్ధమవుతున్నారు. వచ్చే 15 రోజుల్లో అమరీందర్ నూతన రాజకీయ పార్టీని ప్రకటించే అవకాశాలున్నాయని ఆయన సన్నిహిత వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. ఈ విషయమై ఇప్పటికే తన మద్దతుదారులతో విస్తృతంగా మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
అంతేగాక, దాదాపు డజను మంది కాంగ్రెస్ నేతలు కెప్టెన్‌తో(amarinder singh news) చర్చలు జరుపుతున్నారని, ఆయన కొత్త పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత వారంతా అందులో చేరే అవకాశమున్నట్లు సమాచారం. వీరిలో కొందరు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారట. అటు పంజాబ్‌కు చెందిన రైతు నేతలతోనూ అమరీందర్ త్వరలోనే సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.