పంజాబ్లో విషాదం జరిగింది. అప్పుల బాధ భరించలేక ఓ రైతు, అతని కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. హోషియార్పుర్ జిల్లా ముహాదిపుర్లో జగ్తార్ సింగ్(70), అతని కుమారుడు కృపాల్ సింగ్(42) శనివారం ఉదయం మృతిచెందినట్లు డీఎస్పీ మునీష్ కుమార్ తెలిపారు. విషాహారం తీసుకుని వారు ఆత్మహత్యకు పాల్పడ్డారని చెప్పారు. వారి ఇంట్లో ఓ సూసైడ్నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
వ్యవసాయ రుణాలను మాఫీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైనందున, కేంద్రం సాగు చట్టాలను రద్దు చేయని నేపథ్యంలోనే తాము బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు వారు ఆ లేఖలో పేర్కొన్నారు. మృతి చెందిన తండ్రీ కుమారుడికి తలో ఎకరం పొలం ఉందని పోలీసులు చెప్పారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించామని తెలిపారు.
రాజకీయ రగడ..