Punjab Election Result: పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ఓటమి పాలయ్యారు. పాటియాలా నుంచి బరిలోకి దిగిన ఆయన గెలుపొందలేకపోయారు. అమరీందర్ సింగ్‌పై ఆప్ అభ్యర్థి అజిత్‌పాల్ కోహ్లీ గెలుపొందారు. 19,873 ఓట్ల తేడాతో కోహ్లీ విజయం సాధించారు.
కోహ్లీ చేతిలో పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ ఓటమి - పంజాబ్ ఎన్నికలు అమరీందర్ సింగ్
Punjab Election Result: పాటియాలా నుంచి బరిలోకి దిగిన పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్.. ఆప్ అభ్యర్థి అజిత్‌పాల్ కోహ్లీ చేతిలో ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలతో పార్టీని వీడిన అమరీందర్ సింగ్.. సొంత పార్టీ స్థాపించి ఎన్నికల్లో పోటీ చేశారు.
అమరీందర్ సింగ్
ఎన్నికలకు కొద్ది నెలల ముందు కాంగ్రెస్‌ను వీడిన అమరీందర్.. కొత్తగా పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారు. పార్టీ అంతర్గత విభేదాలతో కాంగ్రెస్‌ను వీడిన ఆయన తొలుత భాజపాలో చేరతారనే ప్రచారం జరిగింది. చివరకు కొత్త పార్టీ పెట్టి బరిలోకి దిగిన అమరీందర్ ఓటమి పాలవ్వడం గమనార్హం.
ఇదీ చూడండి :'యూపీలోని 17 జిల్లాల్లో హింసకు ఛాన్స్'.. ఐబీ హెచ్చరికతో అలర్ట్
Last Updated : Mar 10, 2022, 2:38 PM IST