పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జీత్ సింగ్ చన్నీ, పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు(Punjab pcc president) నవజ్యోత్ సింగ్ సిద్ధూకు మధ్య అభిప్రాయ భేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా.. గురుగ్రంథ్ సాహిబ్ అపవిత్రమైన ఘటన(Sacrilege of the Guru Granth Sahib), మత్తుపదార్థాల విక్రయాలకు సంబంధించిన వ్యవహారాలను ముఖ్యమంత్రి పరిష్కరించకపోతే.. తాను నిరాహార దీక్ష(Sidhu hunger strike) చేపడతానని హెచ్చరించారు సిద్ధూ. మోగాలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశానికి హాజరైన ఆయన ఈ మేరకు మాట్లాడారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియాను నిర్మూలించి, పన్నులు వసూలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం అప్పుల ఊబి నుంచి బయటపడుతుందని పేర్కొన్నారు.
"రాష్ట్రంలో ముఖ్యమంత్రి మారినందున.. గురు గ్రంథ్ సాహిబ్ అపవిత్రమైన అంశం పరిష్కారమవ్వాలి. రాష్ట్రంలో ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియాను నిర్మూలించాలి. వీటిపై పంజాబ్ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోతే.. నా గళాన్ని వినిపిస్తూనే ఉంటాను."
-నవజ్యోత్ సింగ్ సిద్ధూ, పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు