రుణ మాఫీ పథకం కింద వ్యవసాయ కూలీలకు, కౌలుదారులకు రూ. 590 కోట్ల లోన్లు మాఫీ చేస్తున్నట్లు పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరిందర్ సింగ్ ప్రకటించారు. 2,85,325 మంది ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్) సభ్యులకు ప్రభుత్వం రుణ మాఫీ చేయనుందని పేర్కొన్నారు. ఒక్కొక్కరికి రూ. 20,000 చొప్పున రుణం మాఫీ అవుతుందని తెలిపారు.
ఆగస్టు 20 నుంచి రుణసాయానికి సంబంధించిన చెక్లు అందించనున్నట్లు మంగళవారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశం అనంతరం ఓ అధికారి వెల్లడించారు. ఇప్పటివరకు ఈ పథకం కింద 5.64 లక్షల రైతులు లబ్ధి పొందారని అన్నారు. మొత్తంగా రూ. 4624 కోట్ల రుణమాఫీ చేసినట్లు పేర్కొన్నారు.