Punjab heroin seize: పంజాబ్ సరిహద్దులో 3 కేజీల హెరాయిన్‌ను సీజ్ చేశారు బీఎస్ఎఫ్ సిబ్బంది. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఆనుకుని ఉన్న జోధావాలా గ్రామం సమీపంలో ఓ వ్యక్తి నుంచి వీటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ మాదకద్రవ్యాల విలువ రూ.15 కోట్లు ఉంటుందని అంచనావేశారు. అబోహార్ సెక్టార్ వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సిబ్బందికి సరిహద్దు సమీపంలో ఓ వ్యక్తి దాక్కున్నట్లు కనిపించాడు. అతనివద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా బైక్‌పై పారిపోయాడు. అయితే అక్కడి వెళ్లి చూసిన సిబ్బందికి ఆకుపచ్చ వస్త్రంలో చుట్టి ఉన్న రెండు ప్లాస్టిక్ బాటిళ్లు కనిపించాయి. తెరిచి చూడగా.. వాటిలో హెరాయిన్ ఉంది.
రూ.15 కోట్ల హెరాయిన్ సీజ్.. ఆఫ్రికా మహిళ శరీరంలో 70 డ్రగ్ క్యాప్సుల్స్ - హెరాయిన్
Punjab Heroin Seize: పంజాబ్‌లో రూ.15 కోట్లు విలువ చేసే హెరాయిన్‌ను సీజ్ చేశారు సరిహద్దు భద్రతా దళం సిబ్బంది. రెండు ప్లాస్టిక్ బాటిళ్లలో దీన్ని గుర్తించినట్లు వెల్లడించారు.
రాజస్థాన్‌లో: ఏప్రిల్ 28న షార్జా నుంచి రాజస్థాన్ వచ్చిన ఆఫ్రికా మహిళ శరీరంలో రూ.4.7 కోట్లు విలువ చేసే 70 హెరాయిన్ క్యాప్సుల్స్‌ను గుర్తించారు అధికారులు. కోర్టు అనుమతితో ఆమెను ఆస్పత్రిలో చేర్పించి ఐదు రోజుల తర్వాత వాటిని రికవరీ చేసుకున్నారు. అనంతరం కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం ఆమెకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఉగాండా దేశస్థురాలైన ఆమె వద్ద నుంచి మొత్తం 678 గ్రాముల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఇదీ చదవండి:2024 సార్వత్రిక ఎన్నికలకు ముందే యూనిఫాం సివిల్ కోడ్!