Punjab Assembly Polls: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో యువతను ఆకట్టుకునేందుకు బంపర్ ఆఫర్ ప్రకటించారు పంజాబ్ కాంగ్రెస్ ఛీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ. కళాశాలకు వెళ్లే అమ్మాయిలకు ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. లూధియానాలో అభివృద్ధి చేసిన ఈ-స్కూటర్లు ఇస్తామని శుభవార్త చెప్పారు.
ఈ ప్రకటన నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన సిద్ధూ ప్రతిపక్షాలపై మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఉపయోగపడే అంశాలపై అవి ఎప్పుడూ దృష్టిపెట్టవని అన్నారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధి దృష్ట్యా.. 'పంజాబ్ మోడల్'లో భాగంగా.. లూధియానాను పారిశ్రామిక వాడగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. లూధియానాతో పాటు మొహాలీని ఐటీ హబ్‌గా, కపుర్తలా- బటాలాను ఫౌండ్రీ క్లస్టర్‌గా, పటియాలాను ఫుడ్ ప్రాసెసింగ్ హబ్‌గా, అమృత్సర్ను మెడికల్ అండ్ టూరిజం హబ్‌గా, మలౌట్, ముక్త్సర్ను వస్త్ర పరిశ్రమ, వ్యవసాయ రంగ ఉత్పత్తుల క్లస్టర్‌గా మారుస్తామని చెప్పుకొచ్చారు.
ఇదీ చదవండి: