తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పంజాబ్ ఎన్నికల్లో 'కెప్టెన్' పార్టీతో భాజపా పొత్తు - పంజాబ్​లో అసెంబ్లీ ఎన్నికలు

Punjab Assembly Polls Bjp: త్వరలో జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్ లోక్ కాంగ్రెస్​ పార్టీతో తమ పార్టీ కలిసి పోటీ చేస్తుందని కేంద్ర మంత్రి, పంజాబ్ భాజపా ఇన్​ఛార్జ్​ గజేంద్ర సింగ్ షెకావత్ శుక్రవారం ప్రకటించారు. ఏడు రౌండ్ల చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

Punjab Assembly Polls Bjp
పంజాబ్ ఎన్నికలు

By

Published : Dec 17, 2021, 5:40 PM IST

Updated : Dec 17, 2021, 8:07 PM IST

Punjab Assembly Polls Bjp: వచ్చే ఏడాది జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్​ నేతృత్వంలోని పంజాబ్ లోక్ కాంగ్రెస్​ పార్టీతో భాజపా కలిసి పోటీ చేయనుంది. దిల్లీలో అమరీందర్ సింగ్​తో భేటీ అనంతరం.. కేంద్ర మంత్రి, పంజాబ్ భాజపా ఇన్​ఛార్జ్​ గజేంద్ర సింగ్ షెకావత్ శుక్రవారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

"ఏడు రౌండ్ల చర్చల తర్వాత ఈ రోజు నేను స్పష్టం చేస్తున్నాను. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా, పంజాబ్​ లోక్ కాంగ్రెస్​ కలిసి పోటీ చేస్తాయి. సీట్ల పంపిణీ వంటి విషయాలు తగిన సమయంలో చర్చిస్తాం."

-గజేంద్ర సింగ్ షెకావత్, పంజాబ్ భాజపా ఇన్​ఛార్జ్​

'101శాతం గెలుపు మాదే'

Punjab Lok Congress Bjp alliance: తమ కూటమి పంజాబ్ ఎన్నికల్లో 101శాతం తప్పక గెలుస్తుందని అమరీందర్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. గెలుపులో సీట్ల పంపిణీ ప్రక్రియ ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పారు.

మరోవైపు.. పంజాబ్​లో పటియాలాలోని 22 మంది కార్పొరేటర్లు సహా ఇతర కాంగ్రెస్​ నేతలు.. 'పంజాబ్ లోక్ కాంగ్రెస్​' కండువా కప్పుకున్నారు. పటియాలాలో జరిగిన ఓ కార్యక్రమంలో.. అమరీందర్ సింగ్ కుమార్తె బిబా జై ఇందేర్ కౌర్​ సమక్షంలో ఈ నేతలంతా ఆ పార్టీలో చేరారు.

పంజాబ్ లోక్ కాంగ్రెస్ కండువా కప్పుకున్న మహిళా నేతలు
పంజాబ్ లోక్ కాంగ్రెస్​లో చేరిన పటియాలా కార్పొరేటర్లు, నేతలు

ఇదీ చూడండి:ఎన్నికల కమిషనర్లతో పీఎంఓ భేటీ- కాంగ్రెస్ ధ్వజం

Last Updated : Dec 17, 2021, 8:07 PM IST

ABOUT THE AUTHOR

...view details