Pulwama Encounter: జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో భద్రతాబలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు ముష్కరులను హతమార్చినట్లు అధికారులు తెలిపారు.
Pulwama Encounter: పుల్వామాలో ఎన్కౌంటర్.. జైషే కమాండర్ హతం - పుల్వామాలో భారీ ఎన్కౌంటర్
09:16 December 01
Pulwama Encounter: పుల్వామాలో ఎన్కౌంటర్.. జైషే కమాండర్ హతం
Jaish Commander Killed: మృతుల్లో జైష్-ఏ-మహమ్మద్(జేఈహెచ్) ఉగ్రవాదసంస్థకు చెందిన కీలక కమాండర్ యాసిర్ పరే ఉన్నట్లు కశ్మీర్ ఐజీపీ విజయ్‌కుమార్ వెల్లడించారు. ఐఈడీ అమర్చడంలో యాసిర్ సిద్ధహస్తుడన్నారు. అనేక ఉగ్రవాద కార్యకలాపాల్లో వీరికి ప్రమేయం ఉన్నట్లు పేర్కొన్నారు.
పుల్వామా జిల్లాలోని క్వాస్బయార్ ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా.. ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. వెంటనే అప్రమత్తమైన భద్రతాదళాలు.. ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టినట్లు ఓ అధికార ప్రతినిధి తెలిపారు.
ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో మరింత భద్రతను ఏర్పాటు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.