మత్తు పదార్థాల విక్రయానికి కొత్త దారి ఎంచుకున్నాడు ఓ మానసిక వైద్యుడు. ఎవరికీ అనుమానం రాకుండా డ్రగ్స్‌తో కేసులను తయారు చేసి విక్రయిస్తున్నాడు. సమాచారం అందుకున్న మాదకద్రవ్యాల నిరోధక శాఖ (ఎన్సీబీ) అధికారులు వైద్యుడిని అరెస్ట్ చేశారు.
మానసిక వైద్యుడి 'మత్తు కేకుల' దందా
మానసిక వైద్యుడి మత్తు దందా గుట్టురట్టు చేసింది మాదకద్రవ్యాల నిరోధక శాఖ(ఎన్సీబీ). కేకుల్లో అక్రమంగా మాదకద్రవ్యాలను రవాణా చేస్తున్న వైద్యుడిని అధికారులు అరెస్ట్ చేశారు. అతని దగ్గర నుంచి 10కేజీల మత్తుకేకులను స్వాధీనం చేసుకున్నారు.
ముంబయికి చెందిన రహీమ్ చర్నియా.. ఓ మానసిక వైద్యుడు. మజ్గావ్ ప్రాంతంలో ఓ బేకరీ ఏర్పాటు చేశాడు. డ్రగ్ స్మగ్లర్ల వద్ద మాదక ద్రవ్యాలను కొనుగోలు చేసి.. మత్తు కేకులను తయారు చేసేవాడు. ఈ కేకులకు హష్ బ్రొవైన్ పేరుతో విక్రయిస్తుండేవాడు. అంతేకాక కేకుల్లో మత్తు పదార్థాలను ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసేవాడు. రహీమ్ వ్యాపారంపై పక్కాసమాచారం తెలుసుకున్న ఎన్సీబీ బృందం.. బుధవారం అతడిని అరెస్ట్ చేసింది. నిందితుడి నుంచి 10 కేజీల మత్తు కేకులు, లక్షా 70వేల నగదు, 370 గ్రాముల డ్రగ్స్.. స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి:ఎటు చూసినా వరద.. మధ్యలో బస్సు.. ఏమైందంటే?