కర్ణాటక చిక్కమగళూరులోని ముదిగేరే మండలంలో అమానుష ఘటన జరిగింది. గోనిబీదు స్టేషన్ ఎస్సై.. తనను స్టేషన్‌కు పిలిచి చిత్రహింసలు పెట్టి, తనతో మూత్రం తాగించారని ఓ ఎస్సీ యువకుడు ఆరోపించాడు. ఈ ఘటనపై దర్యాప్తునకు ఎస్పీ ఆదేశించారు.
ఏం జరిగింది?

ఓ మహిళ ఫోన్‌కాల్ సంబంధించిన వివాదంలో గోనిబీదు ఎస్సై అర్జున్.. తనను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి చిత్రహింసలు చేశారని, తనతో మూత్రం తాగించారని యువకుడు ఆరోపించాడు. ఈ ఘటనపై ఎస్సీ సంఘాలు ఉన్నాతాధికారులకు ఫిర్యాదు చేశాయి. మొత్తం వ్యవహారంపై దర్యాప్తునకు ఎస్పీ అక్షయ్ ఆదేశించారు. ఎస్సై అర్జున్ను బదీలీ చేశారు.
ఇలాంటి ఘటనలు అమానవీయమని కాంగ్రెస్ నేత దినేశ్ గుండూరావు ట్వీట్ చేశారు. ఎస్సైపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి :లాక్డౌన్ వేళ బయటకు వస్తే కరోనా టెస్టే!