తెలంగాణ

telangana

ETV Bharat / bharat

LIVE UPDATES: చంద్రబాబు బెయిల్‌, సీఐడీ కస్టడీ పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా - undefined

Protest_Against_Chandrabab_Arrest
Protest_Against_Chandrabab_Arrest

By ETV Bharat Telugu Team

Published : Sep 25, 2023, 9:27 AM IST

Updated : Sep 25, 2023, 5:25 PM IST

17:25 September 25

ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉన్నాం: అచ్చెన్నాయుడు

  • ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉన్నాం: అచ్చెన్నాయుడు
  • రాష్ట్రంలో ప్రజలు తిరగబడి కొట్టే పరిస్థితి వచ్చింది: అచ్చెన్నాయుడు
  • తెదేపా ఏకపక్షంగా గెలవబోతోంది: అచ్చెన్నాయుడు
  • చంద్రబాబు సీఎం అవుతారని సర్వేల్లో, ప్రజల నుంచి వస్తుంది: అచ్చెన్నాయుడు
  • తెదేపాలో ప్రతి నాయకుడు, కార్యకర్త.. చంద్రబాబే: అచ్చెన్నాయుడు
  • పోలీసులు అణచివేసినా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి మద్దతు ఇస్తున్నారు: అచ్చెన్నాయుడు
  • రాష్ట్ర పరిణామాలపై జాతీయ పార్టీలకు చెప్పడానికి లోకేష్‌ దిల్లీ వెళ్లారు: అచ్చెన్నాయుడు
  • రాష్ట్ర పరిణామాలపై జాతీయమీడియా, నేతలకు లోకేష్‌ వివరించారు: అచ్చెన్నాయుడు

17:22 September 25

వచ్చే వారం నుంచి యువగళం పాదయాత్ర: అచ్చెన్నాయుడు

  • వచ్చే వారం నుంచి యువగళం పాదయాత్ర: అచ్చెన్నాయుడు
  • అనుమతులు తీసుకుని పాదయాత్ర చేపడతాం: అచ్చెన్నాయుడు
  • కావాలని పెట్టిన కేసు.. మాకు న్యాయం జరుగుతుంది: అచ్చెన్నాయుడు
  • ఉమ్మడి కార్యక్రమాలపై జనసేనకు సమాచారం ఇచ్చాం: అచ్చెన్నాయుడు
  • గ్రామస్థాయి కార్యకర్త నుంచి రాష్ట్ర నాయకుడి వరకు జనసేనతో సంప్రదింపులు జరిపి జనసేన కార్యకర్తలతో కలిసి ఉమ్మడి కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశాలిచ్చాం: అచ్చెన్నాయుడు
  • చంద్రబాబు జైలులో ఉంటే శునకానందం పొందాలని చూస్తున్నారు: అచ్చెన్నాయుడు
  • నూటికి లక్ష శాతం కక్షసాధింపు చర్య అని చిన్న పిల్లాడిని అడిగినా చెబుతాడు: అచ్చెన్నాయుడు
  • వైఎస్‌ఆర్‌ హయాంలో ఎన్నో కమిటీలు వేసినా ఒక్కటీ నిరూపించలేకపోయారు: అచ్చెన్నాయుడు
  • చంద్రబాబుకు ఏదైనా జరిగితే కర్త, కర్మ, క్రియ జగన్‌ ప్రభుత్వమే: అచ్చెన్నాయుడు

17:16 September 25

కనీస ఆధారం లేకుండా చంద్రబాబుపై కేసు పెట్టారు: అచ్చెన్నాయుడు

  • కనీస ఆధారం లేకుండా చంద్రబాబుపై కేసు పెట్టారు: అచ్చెన్నాయుడు
  • చంద్రబాబును తప్పుడు కేసులో ఇరికించి జైలులో పెట్టారు: అచ్చెన్నాయుడు
  • ప్రజాస్వామ్య చరిత్రలో ఇలాంటి కేసు ఎప్పుడూ చూడలేదు: అచ్చెన్నాయుడు
  • ఏదైనా కేసు పెట్టాలంటే కనీస ఆధారాలు ఉండాలి: అచ్చెన్నాయుడు
  • కేసులో ప్రాథమిక ఆధారాలు లేకుండా అరెస్టు చేశారు: అచ్చెన్నాయుడు
  • వాస్తవాలు ఏమీ ప్రజలకు చెప్పడం లేదు: అచ్చెన్నాయుడు
  • చంద్రబాబును రెండ్రోజులపాటు ప్రశ్నించారు: అచ్చెన్నాయుడు
  • దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన నాయకుడిపై కేసు పెట్టారు: అచ్చెన్నాయుడు
  • ప్రజా శ్రేయస్సు కోసం రూ.లక్షల కోట్ల బడ్జెట్‌ ఖర్చు చేశారు: అచ్చెన్నాయుడు
  • రూ.330 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారు: అచ్చెన్నాయుడు
  • చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ యువత రోడ్డెక్కింది: అచ్చెన్నాయుడు
  • ఉద్యమాన్ని అణచివేయాలని పోలీసులు చూస్తున్నారు: అచ్చెన్నాయుడు
  • చంద్రబాబు ప్రోత్సాహంతో హైదరాబాద్‌లో చాలామంది యువత ఉద్యోగాలు చేస్తున్నారు: అచ్చెన్నాయుడు
  • రాజమండ్రిలో చంద్రబాబు కుటుంబానికి సంఘీభావం తెలిపేందుకు యత్నించారు: అచ్చెన్నాయుడు
  • కలుసుకునేందుకు ప్రయత్నం చేస్తే ఏపీలో అల్లకల్లోలం సృష్టించా: అచ్చెన్నాయుడురు
  • చివరకు న్యాయం గెలుస్తుంది.. చిన్న తప్పు కూడా జరగలేదు: అచ్చెన్నాయుడు
  • 33 ప్రశ్నలు, 400 పేజీల రిమాండ్‌ రిపోర్టు లాయర్‌కు ఇస్తామన్నారు: అచ్చెన్నాయుడు
  • చంద్రబాబు భద్రతపై అనుమానావలు వస్తున్నాయి: అచ్చెన్నాయుడు
  • పరిశుభ్రత సరిగా లేదు: అచ్చెన్నాయుడు
  • సూపరింటెండెంట్​తో మాట్లాడాం.. జైలు నియమాలు అమలు చేస్తున్నారు: అచ్చెన్నాయుడు
  • సూపరింటెండెంట్‌పై నిఘా పెట్టారు: అచ్చెన్నాయుడు
  • దోమలు విపరీతంగా ఉన్నాయి: అచ్చెన్నాయుడు
  • రాష్ట్ర బాగు కోసం పోరాటమే ఏకైక మార్గం: అచ్చెన్నాయుడు

17:14 September 25

చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ కర్ణాటక మాన్విలో నిరసన ప్రదర్శన

  • చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ కర్ణాటక మాన్విలో నిరసన ప్రదర్శన
  • రాయచూరు జిల్లా మాన్విలో ప్రవాసాంధ్రుల ఆధ్వర్యంలో నిరసన
  • కర్ణాటక: కాకతీయ పాఠశాల నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ
  • నిరసనలో పార్టీలకతీతంగా పాల్గొన్న ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు
  • పెద్దఎత్తున తరలివచ్చి నిరసనలో పాల్గొన్న తెలుగు ప్రజలు
  • కర్ణాటక: బాబుతో నేను అంటూ ప్లకార్డులు ప్రదర్శన

16:38 September 25

గుంటూరు: చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ తాడికొండలో వినూత్న ప్రదర్శన

  • గుంటూరు: చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ తాడికొండలో వినూత్న ప్రదర్శన
  • చంద్రబాబు ప్లకార్డులు పట్టుకుని వరద నీటిలో తెదేపా శ్రేణుల నినాదాలు
  • అరెస్టులు కాదు.. అభివృద్ధి కావాలని నినాదాలు చేసిన తెదేపా కార్యకర్తలు
  • కొండవీటి వాగు నిర్వహణ లేక పొలాలు ముంపుబారిన పడ్డాయన్న రైతులు
  • తాడికొండలో సుమారు 3 వేల ఎకరాలు నీట మునిగాయన్న రైతులు

15:50 September 25

రాజమండ్రి జైలు వద్దకు వచ్చిన భువనేశ్వరి, బ్రాహ్మణి

  • రాజమండ్రి జైలు వద్దకు వచ్చిన భువనేశ్వరి, బ్రాహ్మణి
  • రాజమండ్రి జైలు వద్దకు వచ్చిన అచ్చెన్న, ప్రత్తిపాటి
  • చంద్రబాబుతో ములాఖత్‌ కానున్న భువనేశ్వరి, బ్రాహ్మణి, అచ్చెన్న

15:46 September 25

చంద్రబాబు బెయిల్‌, సీఐడీ కస్టడీ పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా

  • చంద్రబాబు బెయిల్‌, సీఐడీ కస్టడీ పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా
  • సీఐడీ కస్టడీ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలని ఏసీబీ కోర్టు ఆదేశం
  • కౌంటరు దాఖలు చేయాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులకు ఆదేశం
  • చంద్రబాబు బెయిల్‌, సీఐడీ కస్టడీ పిటిషన్లపై రేపు విచారణ చేస్తామన్న కోర్టు
  • రెండు పిటిషన్లపై రేపు విచారణ జరిపి ఉత్తర్వులు ఇస్తామన్న ఏసీబీ కోర్టు

15:05 September 25

విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు పిటిషన్లపై విచారణ

  • విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు పిటిషన్లపై విచారణ
  • కస్టడీ, బెయిల్ పిటిషన్లలో దేనిపై తొలుత విచారణ జరగాలనే అంశంపై వాదనలు
  • కొనసాగుతున్న సీఐడీ, చంద్రబాబు తరఫు న్యాయవాదుల వాదనలు
  • ఐదు రోజులు కస్టడీకి కోరుతూ పిటిషన్‌ వేసిన సీఐడీ
  • బెయిల్‌ పిటిషన్‌ విచారించాలని కోరిన చంద్రబాబు తరఫు న్యాయవాదులు

14:47 September 25

మంగళగిరిలో రిలే నిరాహారదీక్షలో పాల్గొన్న కన్నా లక్ష్మీనారాయణ

  • మంగళగిరిలో రిలే నిరాహారదీక్షలో పాల్గొన్న కన్నా లక్ష్మీనారాయణ
  • అవినీతి మరకలను అందరికీ అంటించాలని జగన్ కుట్ర: కన్నా లక్ష్మీనారాయణ
  • దేశంలోనే అత్యంత ధనవంతుడు కావాలన్నది జగన్ కోరిక: కన్నా
  • జగన్ అక్రమాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తున్నారు: కన్నా లక్ష్మీనారాయణ
  • తెదేపాకు ప్రజల్లో వస్తున్న స్పందన చూసి జగన్‌కు భయం పట్టుకుంది: కన్నా

14:21 September 25

ప్రతిపక్షాలపై కక్షసాధింపే జగన్‌ పనిగా పెట్టుకున్నారు: పరిటాల సునీత

  • ప్రతిపక్షాలపై కక్షసాధింపే జగన్‌ పనిగా పెట్టుకున్నారు: పరిటాల సునీత
  • కుట్ర పన్ని కేసు పెట్టి వేధిస్తున్నారు: పరిటాల సునీత
  • ప్రాణహాని జరుగుతుందేమోనన్న భయం ఉంది: పరిటాల సునీత
  • డెంగీ జ్వరం వచ్చి ఇటీవలే ఖైదీ చనిపోయారు: పరిటాల సునీత
  • 74 ఏళ్ల వ్యక్తిని సైకో సీఎం వేధిస్తున్నారు: పరిటాల సునీత
  • చంద్రబాబు ఏనాడూ ఏ తప్పూ చేయలేదు: పరిటాల సునీత
  • ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు: పరిటాల సునీత

14:20 September 25

భోజన విరామం తర్వాత విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ

  • చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో విచారణ వాయిదా
  • భోజన విరామం తర్వాత విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ
  • బెయిల్‌ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేసిన సీఐడీ తరఫు న్యాయవాది
  • కౌంటర్‌లో సవరణలు చేసి మళ్లీ ఇవ్వాలని ఆదేశించిన న్యాయమూర్తి
  • ఐదు రోజులు కస్టడీకి కావాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేసిన సీఐడీ
  • బెయిల్‌ పిటిషన్‌ విచారించాలని కోరిన చంద్రబాబు తరఫు న్యాయవాదులు
  • ముందుగా కస్టడీ పిటిషన్‌ను విచారించాలని కోరిన సీఐడీ తరఫు న్యాయవాదులు
  • ముందుగా ఏ పిటిషన్‌ విచారించాలన్న అంశంపై మధ్యాహ్నం నిర్ణయించే అవకాశం

13:22 September 25

చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో విచారణ వాయిదా

చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో విచారణ వాయిదా

విచారణ మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేసిన ఏసీబీ కోర్టు

కస్టడీ విచారణ నివేదికను సీల్డ్‌ కవర్‌లో కోర్టుకు సమర్పించిన సీఐడీ

కౌంటర్ దాఖలు చేసిన సీఐడీ తరఫు న్యాయవాది

కౌంటర్‌లో సవరణలు చేసి మళ్లీ ఇవ్వాలని ఆదేశించిన న్యాయమూర్తి

ఐదు రోజులు కస్టడీకి కావాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేసిన సీఐడీ

సవరణతో కౌంటర్‌ దాఖలు చేశాక మళ్లీ విచారించనున్న న్యాయమూర్తి

13:17 September 25

చంద్రబాబు నిరంతరం ప్రజల కోసమే ఆరాటపడేవారు: భువనేశ్వరి

  • చంద్రబాబు నిరంతరం ప్రజల కోసమే ఆరాటపడేవారు: భువనేశ్వరి
  • రాత్రింబవళ్లు కష్టపడే మనిషిని ఎందుకు అరెస్టు చేశారు: భువనేశ్వరి
  • చంద్రబాబు ఏ తప్పూ చేయలేదు: భువనేశ్వరి
  • రాష్ట్రం కోసం కష్టపడటమే ఆయన చేసిన తప్పా?: భువనేశ్వరి
  • ఐటీ ఉద్యోగుల కార్ల ర్యాలీని ఎక్కడికక్కడ అడ్డుకున్నారు: భువనేశ్వరి
  • రాజమహేంద్రవరానికి ఐటీ ఉద్యోగులు వస్తుంటే అడ్డుకున్నారు: భువనేశ్వరి
  • తెలంగాణ నుంచి ఏపీకి రావాలంటే వీసాలు, పాస్‌పోర్టులు కావాలా?: భువనేశ్వరి
  • శాంతియుత ర్యాలీ చేస్తుంటే ఎందుకు భయపడుతున్నారు: భువనేశ్వరి
  • మహిళలు బయటకు వచ్చి సంఘీభావం తెలుపుతున్నారు: భువనేశ్వరి

13:15 September 25

45 ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు ఏనాడూ తప్పు చేయలేదు: భువనేశ్వరి

  • 45 ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు ఏనాడూ తప్పు చేయలేదు: భువనేశ్వరి
  • చంద్రబాబు ప్రజల మనిషి అని అందరికీ తెలుసు: భువనేశ్వరి
  • తనతో పాటు ప్రజలను ముందుకు తీసుకెళ్లాలనేదే ఆయన లక్ష్యం: భువనేశ్వరి
  • ఏం తప్పు చేశారని ఆయనను జైలులో పెట్టారు: భువనేశ్వరి
  • ప్రజల సొమ్ము తీసుకోవాల్సిన అవసరం మా కుటుంబానికి లేదు: భువనేశ్వరి
  • నేను స్వయంగా ఒక సంస్థను నడుపుతున్నాను: భువనేశ్వరి
  • నా సంస్థలో 2 శాతం వాటా అమ్ముకున్నా రూ.400 కోట్లు వస్తాయి: భువనేశ్వరి
  • ఎన్టీఆర్‌ చూపిన బాటలోనే చంద్రబాబు నడుచుకుంటున్నారు: భువనేశ్వరి
  • ఎన్టీఆర్‌ పేరుతో ట్రస్టు ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేస్తున్నాం: భువనేశ్వరి
  • ఎన్టీఆర్‌ ట్రస్టు ద్వారా రూ. వందల కోట్లు ఖర్చు చేస్తున్నాం: భవనేశ్వరి
  • చంద్రబాబు ఎప్పుడూ ప్రజల గురించే ఆలోచిస్తారు: భువనేశ్వరి
  • రాళ్లతో కూడిన హైటెక్‌ సిటీ ప్రాంతాన్ని చక్కని శిల్పంగా మార్చారు: భువనేశ్వరి

12:47 September 25

జగ్గంపేటలో ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళి అర్పించిన భువనేశ్వరి

  • జగ్గంపేటకు చేరుకున్న నారా భువనేశ్వరి
  • జగ్గంపేటలో ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళి అర్పించిన భువనేశ్వరి

12:10 September 25

చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో విచారణ

  • చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో విచారణ
  • కౌంటర్ దాఖలు చేసిన సీఐడీ తరఫు న్యాయవాది
  • కౌంటర్‌లో సవరణలు చేసి మళ్లీ ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశం
  • కస్టడీ విచారణ నివేదికను సీల్డ్‌ కవర్‌లో కోర్టుకు సమర్పించిన సీఐడీ
  • ఐదు రోజులు కస్టడీకి కావాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేసిన సీఐడీ
  • సవరణతో కౌంటర్‌ దాఖలు చేశాక మళ్లీ విచారించనున్న న్యాయమూర్తి

11:39 September 25

అమరావతి: పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో సమావేశం

  • అమరావతి: పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో సమావేశం
  • సమావేశానికి హాజరైన తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
  • అసెంబ్లీ సమావేశాలకు సమాంతర కార్యక్రమాల నిర్వహణపై చర్చ
  • ప్రభుత్వ తీరుపై ప్రజాక్షేత్రం నుంచే సమాధానం చెబుతామంటున్న తెదేపా
  • తదుపరి కార్యాచరణపై టీడీఎల్పీ భేటీలో చర్చించి నిర్ణయం

11:24 September 25

హైదరాబాద్‌: ట్యాంక్‌బండ్‌పై తెదేపా శ్రేణుల మౌన ర్యాలీ

  • హైదరాబాద్‌: ట్యాంక్‌బండ్‌పై తెదేపా శ్రేణుల మౌన ర్యాలీ
  • అంబేడ్కర్ విగ్రహం నుంచి ఎన్టీఆర్ ఘాట్ వరకు ర్యాలీ
  • ట్యాంక్‌బండ్‌పై ర్యాలీలో పాల్గొన్న నందమూరి సుహాసిని

11:23 September 25

చంద్రబాబును ములాఖత్‌లో కలవనున్న భువనేశ్వరి, బ్రాహ్మణి

  • చంద్రబాబును ములాఖత్‌లో కలవనున్న భువనేశ్వరి, బ్రాహ్మణి
  • సాయంత్రం చంద్రబాబును ములాఖత్‌లో కలవనున్న అచ్చెన్నాయుడు
  • సా. 4 గం.కు చంద్రబాబుతో భువనేశ్వరి, బ్రాహ్మణి, అచ్చెన్న ములాఖత్‌

11:22 September 25

చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టులో మెన్షన్‌ చేసిన న్యాయవాది

చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టులో మెన్షన్‌ చేసిన న్యాయవాది

సుప్రీంకోర్టులో మెన్షన్‌ చేసిన చంద్రబాబు తరఫు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా

ఇది ఏపీ వ్యవహారం... ఏపీలో ప్రతిపక్షాలను అణిచివేస్తున్నారన్న సిద్దార్ధ లూథ్రా

ఎన్ని రోజుల నుంచి చంద్రబాబు కస్టడీలో ఉన్నారని అడిగిన సీజేఐ

ఈనెల 8న చంద్రబాబును అరెస్టు చేశారని చెప్పిన సిద్దార్ధ లూథ్రా

రేపు మెన్షన్‌ లిస్ట్‌ ద్వారా రావాలని సూచించిన సీజేఐ

11:21 September 25

చంద్రబాబు పిటిషన్‌ను సుప్రీంకోర్టులో మెన్షన్‌ చేసిన న్యాయవాదులు

  • చంద్రబాబు పిటిషన్‌ను సుప్రీంకోర్టులో మెన్షన్‌ చేసిన న్యాయవాదులు
  • రేపు మెన్షన్‌ లిస్టు ద్వారా రావాలని న్యాయవాదులకు చెప్పిన సీజేఐ
  • ఎన్ని రోజుల నుంచి చంద్రబాబు కస్టడీలో ఉన్నారని అడిగిన సీజేఐ
  • రేపు మెన్షన్‌ లిస్టులో వింటామన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

11:20 September 25

నెల్లూరు గ్రామీణ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో చేనేతల నిరసన

  • నెల్లూరు గ్రామీణ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో చేనేతల నిరసన
  • రాట్నం వడుకుతూ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, గిరిధర్‌రెడ్డి నిరసన
  • తెదేపాకు ప్రజల్లో స్పందన చూసి జగన్‌కు భయం పట్టుకుంది: కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి

11:19 September 25

అన్నవరం సత్యదేవుణ్ని దర్శించుకున్న నారా భువనేశ్వరి

  • అన్నవరం సత్యదేవుణ్ని దర్శించుకున్న నారా భువనేశ్వరి
  • చంద్రబాబు త్వరగా విడుదల కావాలంటూ ప్రత్యేక పూజలు

11:15 September 25

మహిళల పట్ల ఏపీ పోలీసులు కర్కశంగా వ్యవహరించడం దుర్మార్గం: బ్రాహ్మణి

  • మహిళల పట్ల ఏపీ పోలీసులు కర్కశంగా వ్యవహరించడం దుర్మార్గం: బ్రాహ్మణి
  • ఉద్యోగాల సృష్టికి పితామహుడిగా చంద్రబాబును గుర్తించిన ఐటీ ఉద్యోగులకు కృతజ్ఞతలు: బ్రాహ్మణి
  • ఐటీ ఉద్యోగులు రాజమండ్రి రాకుండా పోలీసులు అడ్డుకోవడం దురదృష్టకరం: బ్రాహ్మణి

09:28 September 25

సీఐడీ కస్టడీకి ఇవ్వడంపై హైకోర్టులో చంద్రబాబు పిటిషన్‌

  • సీఐడీ కస్టడీకి ఇవ్వడంపై హైకోర్టులో చంద్రబాబు పిటిషన్‌
  • చంద్రబాబు పిటిషన్‌పై ఇవాళ హైకోర్టులో విచారణ

09:28 September 25

చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై నేడు విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ

  • చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై నేడు విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ
  • నైపుణ్యాభివృద్ధి సంస్థ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌
  • మరో రెండు కేసుల్లో సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్‌ పిటిషన్లపై విచారణ
  • ఇన్నర్‌ రింగ్‌రోడ్డు, ఫైబర్‌గ్రిడ్‌ కేసుల్లో పీటీ వారెంట్‌ పిటిషన్లపై విచారించే అవకాశం

09:27 September 25

నేటినుంచి అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన టీడీపీ

  • నేటినుంచి అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన టీడీపీ
  • పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో నేడు సమావేశం
  • భేటీకి హాజరుకానున్న టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
  • అసెంబ్లీ సమావేశాలకు సమాంతర కార్యక్రమాల నిర్వహణపై చర్చ
  • ప్రభుత్వ తీరుపై ప్రజాక్షేత్రం నుంచే సమాధానం చెబుతామంటున్న టీడీపీ
  • తదుపరి కార్యాచరణపై ఎన్టీఆర్ భవన్‌లో జరిగే టీడీఎల్పీ భేటీలో చర్చ

09:26 September 25

నేడు అన్నవరం సత్యదేవుణ్ని దర్శించుకోనున్న భువనేశ్వరి

  • నేడు అన్నవరం సత్యదేవుణ్ని దర్శించుకోనున్న భువనేశ్వరి
  • చంద్రబాబు త్వరగా విడుదల కావాలంటూ ప్రత్యేక పూజలు
  • జగ్గంపేటలో తెదేపా రిలే దీక్ష శిబిరాన్ని సందర్శించనున్న భువనేశ్వరి
  • తెదేపా నేత జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో జగ్గంపేటలో తెదేపా దీక్ష

09:09 September 25

LIVE UPDATES: మరో రెండు కేసుల్లో సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్‌ పిటిషన్లపై విచారణ

  • నేడు చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో విచారణ
  • నైపుణ్యాభివృద్ధి సంస్థ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై వివారణ
  • మరో రెండు కేసుల్లో సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్‌ పిటిషన్లపై విచారణ
  • ఇన్నర్‌ రింగ్‌రోడ్డు, ఫైబర్‌గ్రిడ్‌ కేసుల్లో పీటీ వారెంట్‌ పిటిషన్లపై విచారణ జరిగే అవకాశం
Last Updated : Sep 25, 2023, 5:25 PM IST

For All Latest Updates

TAGGED:

cbn

ABOUT THE AUTHOR

...view details