Alliance air flight: ఎయిర్ ఇండియా ఉపసంస్థ అలయన్స్ ఎయిర్‌కు చెందిన ఓ విమానం ఇంజిన్ కవర్ లేకుండానే టేకాఫ్ అయింది. బుధవారం ఉదయం ముంబయి విమానాశ్రయంలో ఈ ఘటన జరిగింది. విమానం టేకాఫ్ అయిన కాసేపటికే రన్‌వేపై ఇంజిన్ కవర్‌ను గుర్తించినట్లు ఎయిర్‌పోర్టు వర్గాలు తెలిపాయి. విమానం ముంబయి నుంచి గుజరాత్‌లోని భుజ్‌కు బయల్దేరుతుండగా రన్‌వేపైనే ఇంజిన్ కవర్ ఊడిపోయిందని, అయినప్పటికీ విమానం యథావిధిగా టేకాఫ్ అయిందని పేర్కొన్నాయి.
విమానం టేకాఫ్ అయిన వెంటనే ఇంజిన్ కవర్ పడిపోయిన విషయాన్ని ముంబయి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తెలియజేసిందని సంబంధిత అధికారులు తెలిపారు.
ఈ ఘటనపై దర్యాప్తు జరపాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA) ఆదేశించింది.