నోట్ల రద్దు.. భాజపా ప్రభుత్వ భారీ వైఫల్యమని (Priyanka Gandhi latest news) కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. ఒకవేళ అది సరైన నిర్ణయమే అయితే.. అవినీతి ఎందుకు అంతం కాలేదని ప్రశ్నించారు. నల్లధనాన్ని స్వదేశానికి ఎందుకు తీసుకురాలేదని మండిపడ్డారు. నోట్ల రద్దు చేసి నేటితో ఐదేళ్లు గడుస్తున్న సందర్భంగా (demonetisation fifth anniversary) ఈ మేరకు స్పందించారు.
"నోట్ల రద్దు సరైనా నిర్ణయమే అయితే.. నల్లధనాన్ని స్వదేశానికి ఎందుకు తీసుకురాలేదు? నగదు రహిత ఆర్థిక వ్యవస్థ, ఉగ్రవాదం కట్టడి సాధ్యం కాకపోవటానికి కారణాలేంటి? ద్రవ్యోల్బణం ఎందుకు పెరిగిపోతోంది?"అని ట్విట్టర్ వేదికగా ప్రియాంక ప్రశ్నించారు.
ప్రజల ప్రయోజనం ఆశించి నోట్ల రద్దు చేయలేదని కేంద్రాన్ని కాంగ్రెస్ విమర్శిచింది. ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడిందని ఆరోపించింది.