కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాను(Union minister Ajay Mishra) పదవి నుంచి తొలగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి(PM modi news) లేఖ రాశారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ(priyanka gandhi news). రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే అజయ్ మిశ్రా(ashish mishra lakhimpur) హాజరయ్యే డీజీపీల సమావేశానికి రావొద్దని కోరారు.
ఝాన్సీ, మహోబాల్లో శుక్రవారం పర్యటించిన మోదీ(Modi Up tour).. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన తేలికపాటి యుద్ధ హెలికాప్టర్లు, డ్రోన్లు, ఎలక్ట్రానిక్ సూట్లను సైనిక బలగాలకు అందించారు. ఆ తర్వాత లఖ్నవూ చేరుకున్నారు. లఖ్నవూలో శనివారం జరిగే డీజీపీ, ఐజీల సమావేశానికి మోదీ హాజరవనున్న నేపథ్యంలో ఈ మేరకు లేఖ రాశారు ప్రియాంక.
"లఖ్నవూలో జరిగే డీజీపీ, ఐజీ సమావేశానికి మోదీ హాజరవ్వొద్దు. అదే విషయంపై ప్రధానికి లేఖ రాశాను. రైతుల పట్ల నిజంగా ఆందోళన చెందితే, లఖింపుర్ ఖేరి హింసలో నిందితుడి తండ్రి, హోంశాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రాతో వేదికను పంచుకోవద్దు. రాజకీయ ఒత్తిళ్లతో ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం న్యాయం జరగకుండా చేసేందుకు ప్రయత్నిస్తోంది. రైతుల కుటుంబాలకు న్యాయం కావాలి. హోంశాఖ సహాయ మంత్రి పదవిలో కొనసాగితే.. న్యాయం ఎప్పటికీ దొరకదు. దేశవ్యాప్తంగా రైతులపై నమోదైన కేసులను ఎత్తివేయాలని ప్రధాని మోదీని కోరాను. బాధిత రైతు కుటుంబాలకు పరిహారం చెల్లించాలని అభ్యర్థించా. "
- ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి.