తమ సమస్యలను పరిష్కరించాలంటూ.. కేరళకు చెందిన ఓ నాలుగో తరగతి విద్యార్థిని ..ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసింది. ఈ లేఖకు స్పందించిన ప్రధాని కార్యాలయం.. వివరణ ఇచ్చి, సమస్యను పరిష్కరించాల్సిందిగా స్థానిక అధికారులను ఆదేశించింది. దీంతో.. ప్రస్తుతం ఆ చిన్నారి వార్తల్లో నిలిచింది.
వంతెన నిర్మాణం కోసం..
ఎమ్ ఆర్ అతుల్య.. మలప్పురం జిల్లావాసి. ఆమె చుంగతార కార్మిలిగిరి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో చదువుకుంటోంది. అయితే స్థానికంగా కలక్కమ్ నదిపై సరైన వంతెన లేకపోవడం వల్ల అక్కడి వారందరూ ఎన్నో ఏళ్లుగా ఇబ్బందిపడుతూనే ఉన్నారు. ఇక వర్షాకాలంలో నది పరిసర ప్రాంతాల ప్రజలు ఒంటరి వారు అపోయినట్టే. బయట ప్రపంచంతో సంబంధం పూర్తిగా తెగిపోతుంది. అధికారులకు, రాజకీయ పార్టీలకు ఈ విషయంపై విజ్ఞప్తి చేసినా ఫలితం దక్కలేదు. ఈ నేపథ్యంలో అతుల్య.. ఏకంగా ప్రధానమంత్రికే లేఖరాసింది. కలక్కమ్ నదిపై వంతెనను నిర్మించాలని కోరింది.
"చర్చి, పాఠశాల, మార్కెట్.. ఇలా ఇక్కడి ప్రజలు దేనికోసమైనా పక్కనే ఉన్న పట్టణానికి వెళ్లాలి. అందుకోసం నదిని దాటాలి. వర్షాకాలంలో పరిస్థితి దారుణంగా ఉంటుంది. దయచేసి పరిస్థితిని సమీక్షించి చర్యలు తీసుకోండి."