Boris Johnson India Visit: రెండు రోజుల పర్యటనలో భాగంగా భారత్‌కు విచ్చేసిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు ప్రధాని మోదీ ఘనస్వాగతం పలికారు. ప్రభుత్వ లాంఛనాలతో దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌కు సాదర స్వాగతం పలికారు. ఈ క్రమంలో కరచాలనంతో ఇరుదేశాధినేతలు ఒకరికొకరు అభివాదం చేసుకున్నారు. అంతకుముందు రాజ్‌ఘాట్‌ను సందర్శించిన బ్రిటన్ ప్రధాని.. మహాత్మా గాంధీ స్మారకం వద్ద నివాళులు అర్పించారు. పూలు వేసి మహాత్ముడి సేవలను స్మరించుకున్నారు. అనంతరం రాజ్‌ఘాట్ సిబ్బంది బోరిస్‌కు జ్ఞాపిక అందజేశారు. తనకు ఘన స్వాగతం పలికినందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
బోరిస్‌కు మోదీ ఘన స్వాగతం.. ద్వైపాక్షిక భేటీలో కీలక అంశాలు - బోరిస్ జాన్సన్ మోదీ
Boris Johnson Modi Meeting: భారత్‌లో రెండోరోజు పర్యటిస్తున్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు రాష్ట్రపతి భవన్లో మోదీ ఘనస్వాగతం పలికారు. అంతకుముందు రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీకి బోరిస్ నివాళులు అర్పించారు.
మోదీ-బోరిస్ భేటీ..: ఈరోజు ప్రధాని మోదీ, బ్రిటన్ ప్రధాని బోరీస్ జాన్సన్ ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొంటారు. ఉదయం 11:30కి హైదరాబాద్ హౌస్ లో భేటీ కానున్నారు. ద్వైపాక్షిక సంబంధాలతోపాటు ఉక్రెయిన్ తదితర ముఖ్యమైన అంశాలపై చర్చలు జరగనున్నట్లు సమాచారం. దేశంలో ఆర్ధిక నేరాలకు పాల్పడి పారిపోయిన నీరవ్ మోదీ, విజయ్ మాల్యా వంటి వారిని అప్పగించడంపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. భారతదేశ వ్యతిరేక అంశాలు, యూకేలో ఖలిస్థాన్ మద్దతుదారుల వ్యవహారం కూడా చర్చకు రావచ్చు. అంతేకాకుండా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, ఇండో-పసిఫిక్ ప్రాంతం, ఉగ్రవాదానికి సంబంధించిన అంశాలు సహా భారత్‌లో పెట్టుబడులు, బ్రిటన్‌లోని భారతీయులకు వీసాల సడలింపు వంటి అంశాలపై ప్రధానంగా భేటీలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి:షరతుల్లేకుండా కాంగ్రెస్‌లోకి ప్రశాంత్ కిశోర్- జగన్‌తో పొత్తుకు వ్యూహం!