అమెరికా పర్యటనను(modi us visit 2021) దిగ్విజయంగా ముగించుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(pm modi news).. ఆదివారం మధ్యాహ్నం దేశ రాజధాని దిల్లీకి చేరుకున్నారు. దిల్లీ విమానాశ్రయంలో మోదీకి ఘన స్వాగతం లభించింది. భాజపా జాతీయ అధ్యక్షుడు జే.పీ నడ్డా సహా పలువురు పార్టీ సభ్యులు మోదీకి స్వాగతం పలికారు.
దిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న మోదీ మోదీకి స్వాగతం పలికేందుకు వేలాది మంది భాజపా కార్యకర్తలు, మోదీ మద్దతుదారులు విమానాశ్రయానికి తరలివెళ్లారు.
మోదీకి స్వాగతం పలుకుతున్న నడ్డా ప్రధానికి స్వాగతం పలుకుతున్న నేతలు భారీ పూలమాలతో సత్కరిస్తున్న భాజపా నేతలు అమెరికా పర్యటన సాగిందిలా..
మూడు రోజుల పర్యటన(modi in usa) కోసం ఈ నెల 22న ప్రధాని మోదీ అమెరికాకు పయనమయ్యారు. అక్కడ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌తో పాటు వివిధ వ్యాపార సంస్థ సీఈఓలతో భేటీ అయ్యారు. మోదీ-బైడెన్ భేటీతో ఇరు దేశాల మైత్రి మరింత బలపడిందని అమెరికా ప్రకటించింది. బైడెన్ నిర్వహించిన క్వాడ్ సమావేశంలోనూ మోదీ పాల్గొన్నారు. అదే సమయంలో ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిస్, జపాన్ ప్రధాని సుగాతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు.
25న న్యూయార్క్‌లో ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలోప్రసగించిన మోదీ.. అదే రోజున భారత్‌కు తిరుగుపయనమయ్యారు.
ఇవీ చూడండి:-'విశ్వశాంతి'కి చోదక శక్తిగా భారత్...