ట్విట్టర్లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న క్రియాశీల రాజకీయ నాయకుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అగ్ర స్థానంలోకి వచ్చారు. ప్రస్తుతం ఆయన్ను 6.47 కోట్ల మంది అనుసరిస్తున్నారు. మొన్నటి వరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 8.87 కోట్ల మంది ఫాలోవర్లతో అగ్రస్థానంలో ఉండేవారు. వాషింగ్టన్‌లోని క్యాపిటల్ భవనంపై ట్రంప్ మద్దతుదారుల దాడి అనంతరం ఆయన ఖాతాను ట్విట్టర్ శాశ్వతంగా తొలిగించింది. దీంతో మోదీకి మొదటి స్థానం దక్కింది.
ట్విట్టర్లో ప్రధాని మోదీనే నెంబర్‌వన్! - ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ఖాతా తొలగింపుతో క్రియాశీల నేతల్లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలి స్థానానికి వచ్చారు. ప్రధాని మోదీకి 6.47 కోట్ల మంది ట్విట్టర్ ఫాలోవర్లు ఉన్నారు.
ట్విట్టర్లో ప్రధాని మోదీనే నెంబర్‌వన్
క్రియాశీలంగా లేని రాజకీయ నేతల్లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న వ్యక్తిగా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఎవరికీ అందనంత ఎత్తులో కొనసాగుతున్నారు. ఒబామాకు 12.79 కోట్ల మంది ట్విట్టర్లో అనుసరిస్తున్నారు. అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌కు ప్రస్తుతం 2.33 కోట్ల మంది ట్విట్టర్ ఫాలోవర్లు ఉన్నారు.
ఇదీ చూడండి:ట్రంప్ ట్విట్టర్ ఖాతాపై శాశ్వత నిషేధం