తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మోదీ సోదరుడి కారుకు ప్రమాదం.. మైసూర్​ ఆస్పత్రిలో చికిత్స - మోదీ సోదరుడి కారు వార్తలు

ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడి కారు ప్రమాదానికి గురైంది. కర్ణాటకలోని మైసూర్​లో జరిగిన ఈ ఘటనలో మోదీ సోదరుడితో పాటు ఆయన కుటుంబసభ్యులు గాయపడ్డారు.

Modi Brother Car Accident
Modi Brother Car Accident

By

Published : Dec 27, 2022, 4:37 PM IST

Updated : Dec 27, 2022, 5:01 PM IST

Modi Brother Car Accident: కర్ణాటకలోని మైసూర్​లో భారత ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడి బెంజ్​ కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ప్రధాని మోదీ సోదరుడు ప్రహ్లాద్ దామోదర్ దాస్ మోదీతో పాటు ఆయన కుటుంబసభ్యులకు గాయాలయ్యాయి.
పోలీసుల వివరాల ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నం​ మోదీ తమ్ముుడు ప్రహ్లాద్​ దామోదర్​ దాస్​తో పాటు ఐదుగురు కుటుంబసభ్యులు.. బెంజ్​ కారులో బయలుదేరారు. మైసూరు నుంచి బందీపుర్​ వైపు వెళ్తుండగా కడకోల సమీపంలో రోడ్డు డివైడర్​ను కారు ఢీకొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకున్నారు.

మోదీ సోదరుడి కారుకు ప్రమాదం

ప్రహ్లాద్ దామోదర్ దాస్ మోదీ కుటుంబసభ్యులను మైసూర్​లోని జేఎస్​ఎస్​ ఆస్పతికి తరలించారు. ప్రహ్లాద్ ముఖానికి గాయమైనట్లు పోలీసులు చెప్పారు. ఆయన కుమారుడు, కోడలు, మనవడు, డ్రైవర్​ స్వల్పంగా గాయపడినట్లు తెలిపారు. ప్రస్తుతం అందరి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు ప్రకటించారు.
కారు ఎయిర్​బ్యాగ్స్ సకాలంలో తెరుచుకోవడం వల్లే అందరూ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారని సమాచారం.

Last Updated : Dec 27, 2022, 5:01 PM IST

ABOUT THE AUTHOR

...view details