రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆదర్శాలను తమ జీవితాల్లో ఇమిడ్చుకోవాలని దేశ ప్రజలకు సూచించారు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. ఆయన స్ఫూర్తితో శక్తిమంతమైన, సంపన్నమైన దేశాన్ని నిర్మించడంలో తోడ్పడాలని పేర్కొన్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా రాష్ట్రపతి నివాళి అర్పించారు.
"అంబేడ్కర్ గొప్ప న్యాయవాది, దేశంలోని అణగారిన వర్గాల ప్రజల సామాజిక-ఆర్థిక స్థితిని మెరుగుపరచడం సహా వారిని విద్యావంతులగా తీర్చి దిద్దే లక్ష్యంతో 'బహిష్కృత హితకారిణి సభ'ను ఏర్పాటు చేశారు. కుల ప్రాతిపదికన లేదా మరే ఇతర కారణాల వల్ల పక్షపాతం ఉండని ఆధునిక భారతదేశాన్ని సృష్టించాలని ఆయన కోరుకున్నారు. శతాబ్దాలుగా వెనుకబాటుకు గురైన మహిళలు, సమాజాలు, ఆర్థిక, సామాజిక హక్కుల సమానత్వం కోసం కృషి చేశారు"