ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ మైదానంగా రికార్డుకెక్కిన గుజరాత్‌లోని మొతేరా స్టేడియాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతితో పాటు.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొన్నారు.
ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే అత్యంత ఖర్చుతో అత్యాధునిక సౌకర్యాలతో ఈ మైదానాన్ని నిర్మించారు. 63 ఎకరాల్లో ఏర్పాటైన ఈ స్టేడియం పునర్నిర్మాణానికి ఏకంగా రూ.800 కోట్లు ఖర్చు చేశారు. అటు.. సర్ధార్ వల్లభాయ్ పటేల్ స్పోర్ట్స్ ఎన్‌క్లేవ్‌కు రాష్ట్రపతి దంపతులు భూమి పూజ చేశారు.