కొవిడ్ వ్యాప్తి కట్టడిలో భాగంగా గర్భిణులకు టీకా ఇచ్చేందుకు భారత్ సన్నద్ధమవుతోంది. ఈ మేరకు నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆఫ్ ఇమ్యూనైజేషన్(ఎన్టీఏజీఐ) చేసిన సిఫార్సుకు కేంద్ర ఆరోగ్య శాఖ ఆమోదం తెలిపింది.
కొవిన్ యాప్లో రిజిస్టరై లేదా నేరుగా వ్యాక్సినేషన్ కేంద్రాలకు వెళ్లైనా గర్భిణులు టీకా తీసుకోవచ్చని ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. దీనికి సంబంధించి రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు సమాచారం అందించినట్లు పేర్కొంది.
కొవిడ్ టీకాలకు సంబంధించి గర్భిణులకు అవగాహన కల్పించడం కోసం వ్యాక్సినేటర్లు, ఫ్రంట్లైన్ వర్కర్లకు కేంద్ర ఆరోగ్య శాఖ ఇటీవలే మార్గదర్శకాలు రూపొందించినట్లు గుర్తుచేసింది.