Pregnant Woman Set on Fire : నాలుగు నెలల గర్భిణీపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు ఆమె భర్త. మూడేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకుని.. అదనపు కట్నం కోసం భార్యపై ఈ దారుణానికి ఒడిగట్టాడు. అందుకు అతడి కుటుంబ సభ్యులు కూడా సాయం చేశారు. అనంతరం అందరూ కలిసి పారిపోయారు. కాలిన గాయలతో వారం రోజుల పాటు చికిత్స పొందిన బాధితురాలు.. సోమవారం మృతి చెందింది. బంగాల్లోని మాల్డా జిల్లాలో ఈ ఘటన జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రతువా బ్లాక్ 2 లోని అజిమ్గంజ్కు చెందిన అకాలు రబిదాస్, ప్రియాంక(23) మూడేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇరువురి కుటుంబ సభ్యుల అంగీకారంతోనే వీరి పెళ్లి జరిగింది. వివాహ సమయంలో తన సామర్థ్యం మేరకు కొంత కట్నాన్ని అల్లుడికి ఇచ్చాడు ప్రియాంక తండ్రి రాజ్‌కుమార్. అయినప్పటికీ అదనపు కట్నంకోసం ప్రియాంకను పదే పదే వేధించేవాడు అకాలు. కూతురు దుస్థితిని చూసి.. అప్పుడప్పుడు కొంత సొమ్మును అల్లుడికిచ్చేవాడు రాజ్‌కుమార్. కొద్ది రోజుల క్రితం కూడా తన తండ్రి దగ్గరి నుంచి లక్ష రూపాయలు తీసుకురావాలని ప్రియాంకను వేధించారు భర్త, అతని కుటుంబ సభ్యులు. అయితే అంత డబ్బును ఇచ్చేందుకు ప్రియాంక తండ్రి నిరాకరించాడు.