తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆరేళ్ల కొడుకును గొంతు కోసి చంపిన తల్లి - 6ఏళ్ల కుమారుడిని హత్య చేసిన గర్భవతి

కేరళలో ఓ గర్భిణీ ఆరేళ్ల కుమారుడ్ని హత్య చేసిన దారుణ ఘటన సంచలనం సృష్టించింది. ఆపై తానే పోలీసులకు సమాచారమిచ్చి లొంగిపోయింది. ఈ హత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పాలక్కడ్ ఎస్పీ వెల్లడించారు.

Pregnant woman murdered her 6-year-old son by cutting the throat
కేరళలో కన్న కొడుకు గొంతుకోసి దారుణ హత్య

By

Published : Feb 7, 2021, 11:00 AM IST

కేరళ పాలక్కడ్‌లోని పూలక్కడ్‌ గ్రామంలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ గర్భవతి తన ఆరేళ్ల కుమారుడిని గొంతు కోసి హత్య చేసింది. ఆదివారం ఉదయం జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. మూడు నెలల గర్భవతి అయిన షాహిదా తన మూడో కుమారుడు అమిల్‌ను వారి ఇంట్లోని బాత్రూంలో హత్య చేసింది. అనంతరం తానే స్వయంగా.. పోలీసులకు సమాచారం ఇచ్చింది.

కేరళలో కన్న కొడుకునే గొంతుకోసి దారుణ హత్య చేసిన తల్లి

మానసిక స్థితిపై దర్యాప్తు..

షాహిదాను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. ఆమెకు మానసిక సమస్యలేమైనా ఉన్నాయా అని స్థానికులను అడిగి తెలుసుకుంటున్నారు. అయితే ఈ విషయంపై తమకేమీ తెలియదని వారు చెప్పినట్టు సమాచారం. ఘటనా స్థలాన్ని సందర్శించిన పాలక్కడ్ ఎస్పీ పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు.

ఇదీ చదవండి:రూ.20 కోసం గొడవ- ఇడ్లీ వ్యాపారి మృతి

ABOUT THE AUTHOR

...view details