Pregnant woman killed: అద్దెకు ఉంటున్న రెండు కుటుంబాల మధ్య జరిగిన గొడవ ఓ గర్భిణీ ప్రాణాలను బలి తీసుకుంది. ఉత్తరాఖండ్ హల్ద్వానీలోని భన్భూల్పురాలో ఈ ఘటన జరిగింది.
ఉజాలా నగర్‌లోని అద్దెకు ఉంటున్న రెండు కుటుంబాల మధ్య.. ఓ విషయంలో గొడవ తలెత్తింది. మంగళవారం సాయంత్రం తీవ్రంగా గొడవపడ్డారు. ఈ క్రమంలోనే 21 ఏళ్ల గర్భిణీని మరో కుటుంబానికి చెందిన వ్యక్తులు భవనం మూడో అంతస్తు పైనుంచి తోసేశారు. ఘటన జరిగిన వెంటనే అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. వెంటనే బాధితురాలిని ఆమె కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే, అప్పటికే ఆమె మరణించిందని వైద్యులు తెలిపారు. మృతురాలిని మంజు దేవీగా గుర్తించారు. ఆమె ఐదు నెలల గర్భంతో ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రాణం తీసిన వివాదం.. గర్భిణీని మూడంతస్తుల పైనుంచి తోసేసి హత్య - ఉత్తరాఖండ్ క్రైమ్ వార్తలు
Pregnant woman killed: ఉత్తరాఖండ్‌లో ఘోరం జరిగింది. రెండు కుటుంబాల మధ్య వివాదం ఓ గర్భిణీ ప్రాణాలమీదకు వచ్చింది. గొడవ పడుతూ ఓ మహిళను మూడంతస్తుల పైనుంచి తోసేశారు మరో కుటుంబానికి చెందిన వ్యక్తులు.
గర్భిణీని మూడంతస్తుల పైనుంచి తోసి హత్య
బాధితురాలి స్వస్థలం ఉత్తర్‌ప్రదేశ్‌లోని బదాయూ అని పోలీసులు తెలిపారు. అయితే, ఈ ఘటనపై ఎవరూ ఇంతవరకు ఫిర్యాదు చేయలేదని వెల్లడించారు. అయినప్పటికీ విచారణ చేపడుతున్నామని చెప్పారు. మహిళను ఎవరు కిందకు తోసేశారనే విషయంపై ఆరా తీస్తున్నారు. మృతదేహాన్ని పోలీసులు తమ అధీనంలోకి తీసుకొని... పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి:చికిత్స చేయించలేక పదేళ్లుగా కుమారుడిని చెట్టుకు కట్టేసి..