Precaution Dose Of Covid: ఒమిక్రాన్ విజృంభిస్తున్న నేపథ్యంలో దేశంలో సోమవారం(జనవరి 10) నుంచి ప్రికాషన్ డోసుపంపిణీ చేయడానికి సర్వం సిద్ధం అయ్యింది. ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్లైన్ వర్కర్లు, 60 ఏళ్లుపైబడి ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ప్రికాషన్ డోసు ఇవ్వనున్నారు. ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపుర్, గోవాలో ఎన్నికల విధులు నిర్వర్తించనున్న సిబ్బందిని ఫ్రంట్లైన్ వర్కర్లుగానే పరిగణించనున్నారు. ఈ మేరకు ప్రికాషన్ డోసు కోసం అర్హులైనవారికి ఇప్పటికే ఎస్ఎమ్ఎస్లు పంపినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు.
1.05 కోట్ల ఆరోగ్య కార్యకర్తలు, 1.9 కోట్ల ఫ్రంట్లైన్ వర్కర్లు, 2.75 కోట్ల 60 ఏళ్ల పైబడినవారు ప్రికాషన్ డోసు వేసుకోనున్నారని అంచనా. ప్రికాషన్ డోసు కింద గతంలో తీసుకున్న వ్యాక్సిన్నే ఇవ్వనున్నట్లు కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. కొవాగ్జిన్ తీసుకున్న వారికి కొవాగ్జిన్, కొవిషీల్డ్ తీసుకున్నవారికి కొవిషీల్డ్నే ఇవ్వనున్నారు.
కొవిడ్-19 ప్రికాషన్ డోసు పొందాలనుకుంటున్న లబ్ధిదారులు మళ్లీ కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఇప్పటికే రెండు డోసులు తీసుకున్న అర్హులైన వారు నేరుగా అపాయింట్మెంట్ తీసుకోవటం లేదా నేరుగా వ్యాక్సినేషన్ కేంద్రానికి వెళ్లి టీకా తీసుకోవచ్చని తెలిపింది.
పోలీసుశాఖలో కలకలం: