తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ముంబయిలో 5 శాతం దిగువకు పాజిటివిటీ రేటు - ముంబయిలో కరోన

కరోనా నుంచి ముంబయి ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. దేశ ఆర్థిక రాజధానిలో పాజిటివిటీ రేటు 5 శాతం కంటే తక్కువగా నమోదైంది. అంతేగాక కొవిడ్​ మరణాలు కూడా తగ్గుముఖం పట్టాయి.

Mumbai
ముంబయిలో అయిదు శాతం దిగువకు పాజిటివిటీ రేటు

By

Published : May 26, 2021, 6:30 AM IST

కరోనా మొదటి దశ నుంచే అధిక కేసులు నమోదువుతూ నిత్యం వార్తల్లో నిలిచిన దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. మహారాష్ట్ర వ్యాప్తంగా భారీగానే కేసులు నమోదవుతున్నా.. ముంబయిలో మాత్రం గత కొద్ది రోజులుగా కేసులు తగ్గుతూ వస్తున్నాయి. మంగళవారం దాదాపు 21 వేల శాంపిల్స్‌ పరీక్షించగా.. 1,037 మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. కాగా పాజిటివిటీ రేటు 4.94 శాతానికి తగ్గడం విశేషం. పాజిటివిటీ రేటు 5శాతం కన్నా తక్కువ ఉంటే సేఫ్‌ జోన్‌లో ఉన్నట్టేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే ప్రకటించింది.

ముంబయిలో మరణాలు కూడా భారీగా తగ్గాయి. కొత్తగా 37 మరణాలు మాత్రమే నమోదయ్యాయి. గత ఏప్రిల్‌ 9 తర్వాత ఇంత తక్కువ సంఖ్యలో మరణాలు నమోదవడం ఇదే తొలిసారి. కట్టుదిట్టమైన నిబంధనలతో కరోనాకు అడ్డుకట్ట వేస్తున్నట్లు అక్కడి అధికారులు చెబుతున్నారు. లాక్‌డౌన్‌ అమలులో ఉన్నా.. మహారాష్ట్రలోని పట్టణాలు, గ్రామాల్లో మాత్రం భారీగానే కేసులు నమోదవుతున్నాయి. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా 24,136 కేసులు నమోదయ్యాయి. 601మంది మృతిచెందారు. 3.14 లక్షల యాక్టివ్‌ కేసులున్నాయి.

ఇదీ చూడండి:'రంగు గురించి భయపడొద్దు.. కారణం తెలుసుకోండి'

ABOUT THE AUTHOR

...view details