తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత్​లో మరోసారి పోలియో కలకలం.. అధికారులు హైఅలర్ట్​! - భారత్​లో పోలియో కలకలం

Polio Virus in India: భారత్​లో మరోసారి పోలియో వైరస్​ కలకలం సృష్టించింది. పోలియో రహిత దేశంగా గుర్తింపు పొందిన ఎనిమిదేళ్ల తర్వాత బంగాల్​ రాజధాని కోల్​కతాలో ఈ వైరస్​ ఆనవాళ్లను గుర్తించారు. దీంతో అధికారులను అప్రమత్తం చేసింది కోల్​కతా మున్సిపల్​ కార్పొరేషన్​.

polio virus detected in Kolkata
భారత్​లో మరోసారి పోలియో కలకలం

By

Published : Jun 16, 2022, 6:54 PM IST

Polio Virus in India: దేశం నుంచి పోలియోను విజయవంతంగా తరిమికొట్టామని చెప్పుకుంటున్న తరుణంలో దాని ఉనికిని గుర్తించటం కలకలం సృష్టిస్తోంది. బంగాల్​ రాజధాని కోల్​కతాలోని మేతియాబురుజ్​ ప్రాంతంలో మురుగు నీటిలో టైప్​-1 పోలియో వైరస్​ను గుర్తించారు. దీంతో అధికారులను అప్రమత్తం చేసినట్లు కోల్​కతా మున్సిపల్​ కార్పొరేషన్​ డిప్యూటీ మేయర్​ అతిన్​ ఘోష్​ తెలిపారు.

ఎనిమిదేళ్ల తర్వాత తొలిసారి డ్రైనేజీ నీటిలో పోలియో వైరస్​ ఆనవాళ్లను గుర్తించామన్నారు ఘోష్. పోలియో వైరస్ మూలాలను కనిపెట్టాలని మున్సిపాలిటీ అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. తమ ప్రాంతంలో ఎవరైనా పోలియో రోగులు ఉన్నారేమో నిర్ధరించుకోవాలని వార్డు కౌన్సిలర్లు, పోలీస్​ స్టేషన్లను ఆదేశించారు​. వైరస్​ వ్యాప్తి జరగకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలని, ముఖ్యంగా బహిరంగ మలవిసర్జన చేయకుండా చూడాలన్నారు.

"2010లో ఆరోగ్య విభాగం బాధ్యతలను మేము తీసుకున్న తర్వాత.. 2013 నాటికి పోలియో కేసులు తగ్గిపోయాయి. పోలియో టీకాలు వేసుకోవాలని ఎప్పటికప్పుడు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. పోలియో కేసులు తగ్గిన క్రమంలో 2014, మార్చి 27న భారత్​ను పోలియో రహిత దేశంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. గత ఎనిమిదేళ్లుగా పోలియో కేసులపై నిఘా పెట్టాం. సాదారణ తనిఖీల్లో భాగంగా గార్డెన్​రీచ్​ ప్రాంతంలోని వార్డులు 139,140,149లోని మురుగు నీటిలో వైరస్​ను గుర్తించాం. "

- అతిన్​ ఘోష్​, డిప్యూటీ మేయర్​

భారత్​లో చివరగా 2011, జనవరి 13న బంగాల్​లోని హావ్​డా ప్రాంతంలో పోలియో కేసు నమోదైంది. అప్పటి నుంచి దేశంలో పోలియో కేసులు నమోదు కాలేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి పోలియో రహిత దేశంగా 2014, మార్చి 27 గుర్తింపు లభించింది. ముందు జాగ్రత్తగా ఐదేళ్ల లోపు పిల్లలకు ఏటా పోలియో టీకాలు వేస్తోంది కేంద్ర ప్రభుత్వం.

ఇదీ చూడండి:బొట్టు బిళ్లలతో 100 అడుగుల పెయింటింగ్.. మోదీ కోసం..

రూ.500 కొడితే 2500.. ఆ ఏటీఎంకు ఎగబడ్డ జనం!

ABOUT THE AUTHOR

...view details