Police Spit On Walls: సామాన్య పౌరులకు దిశానిర్దేశం చేయాల్సిన పోలీసులే.. బాధ్యతలను విస్మరించి ప్రవర్తించారు. కొవిడ్-19 వ్యాప్తి ఉన్నా పోలీస్ స్టేషన్లోనే గుట్కాతిని ఉమ్మివేశారు. పై అధికారులు పలుమార్లు చెప్పినా వినకుండా అలానే చేస్తూ వచ్చారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ షాదోల్ జిల్లాలో జరిగింది.
షాదోల్ ఎస్పీ అవధేశ్ గోస్వామి.. ఘోపార్ పోలీస్ స్టేషన్లో గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. స్టేషన్ గోడలపై పొగాకు మరకలను గుర్తించారు ఎస్పీ. అంతేకాక స్టేషన్ అపరిశుభ్రతగా ఉండటంపై ఆగ్రహం వ్యక్తంచేశారు.