తమిళనాడులోని కాంచీపురం జిల్లా శ్రీపెరంబుదూర్ ప్రాంతంలో ఓ చైన్ స్నాచర్ కలకలం సృష్టించాడు. తుపాకీతో కాల్పులు జరిపి స్థానికులను భయాందోళనలకు గురిచేశాడు. చివరికి పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో మృతిచెందాడు. ఈ ఘటన ఆదివారం జరిగింది.
ఝార్ఘండ్కు చెందిన ముర్తాసా.. శ్రీపెరంబుదూర్‌లోని ఓ టోల్ ప్లాజా వద్ద ఓ 55 ఏళ్ల మహిళ గొలుసును దొంగిలించాడు. అనంతరం అతనితో పాటు వచ్చిన మరో వ్యక్తి నయీమ్ అక్తర్‌తో కలిసి పరారయ్యేందుకు ప్రయత్నించాడు. బాధితురాలి ఆరుపులతో స్థానికులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. ముర్తాసా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.