కరోనా మహమ్మారి రాకతో పిల్లల చదువులన్నీ మొబైల్‌కే పరిమితం అయ్యాయి. ప్రస్తుతం కరోనా తగ్గి పాఠశాలలు ప్రారంభించినా సరే చాలా మంది పిల్లలు మొబైల్లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. అలా వారు సోషల్ మీడియాకు బానిసై.. ఎప్పుడు ఏం చేస్తారో ఎవరూ ఊహించలేకపోతున్నారు. అయితే పుణెలో ఓ 14 ఏళ్ల పాఠశాల విద్యార్థి.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన స్టేటస్.. అతడిపై కేసు నమోదయ్యేలా చేసింది.
'నాకు భార్యవి అవుతావా?'.. ఇన్‌స్టాలో స్టేటస్ పెట్టిన బాలుడికి పోలీసుల బిగ్ షాక్ - ఇన్‌స్టాగ్రామ్‌లో స్టేటస్ కారణంగా అరెస్ట్
ప్రస్తుతం సమాజంలో సోషల్ మీడియా ప్రభావం పెరిగిపోవడం వల్ల ఎవరు ఏం చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. మరీ ముఖ్యంగా కరోనా తర్వాత చిన్నపిల్లలు సైతం మొబైల్‌ను ఎక్కువగా వినియోగించడం మొదులుపెట్టారు. వారు ఎప్పుడు ఏం చేస్తారో ఎవరూ ఊహించలేరు. అయితే మహారాష్ట్రలో ఓ స్కూల్ విద్యార్థి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన స్టేటస్ అందర్నీ ఆశ్చర్యపరిచింది. అసలు ఆ స్టేటస్‌లో ఏం ఉందంటే!
అసలు ఏం జరిగిందంటే..?
పుణెలోని హడప్సర్ ప్రాంతంలో ఓ 14 ఏళ్ల స్కూల్ విద్యార్థి .. తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఓ స్టేటస్ పెట్టాడు. ఆ స్టేటస్ చూసి అతడి స్కూల్ టీచర్ కూడా షాక్‌కు గురయ్యారు. అయితే ఆ విద్యార్థి అదే ప్రాంతానికి చెందిన.. తన స్కూల్లో చదివే 13 ఏళ్ల బాలికను తనతో స్నేహం చేయాలని వెంటపడేవాడు. లేదంటే తనని ఎత్తుకు పోతానని బెదిరించాడు. అయినా సరే ఆ బాలిక అతడ్ని పట్టించుకోలేదు. దీంతో ఆ బాలికపై కోపం పెంచుకున్నాడు. ఆ బాలికను ఫొటో తీసి.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో 'నువ్వు నా భార్యవి అవుతావా?' అని ఓ స్టేటస్ పెట్టాడు. దీన్ని చూసిన ఆ బాలిక జరిగిన విషయాన్ని తన తల్లికి చెప్పింది. దీంతో బాలిక తల్లి హడప్సర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు బాలుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి.. అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.