దేశంలోని మహిళా స్వయం సహాయక సంఘాలతో ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ సమావేశంలో పాల్గొననున్నారు. దీన్‌దయాల్ అంత్యోదయ యోజన కింద లబ్ధిదారులుగా ఉన్న మహిళలతో మాట్లాడనున్నారు. గురువారం జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా.. దేశవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల ద్వారా ఉన్నతస్థాయికి ఎదిగిన మహిళల విజయగాథలతో కూడిన ఓ పుస్తకాన్ని ప్రధాని విడుదల చేయనున్నారు.
నిధుల విడుదల..
నాలుగు లక్షలకుపైగా స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక సాయంగా ప్రధాని రూ.1,625 కోట్లు మంజూరు చేయనున్నారు. దీనితో పాటు పీఎంఎఫ్ఎంఈ (పీఎం ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజస్) పథకం కింద 7,500 మంది స్వయం సహాయక సంఘాల సభ్యులకు రూ.25 కోట్లను విడుదల చేయనున్నారు. 75 ఎఫ్పీఓలకు కూడా రూ.4.13 కోట్లను నిధులను ప్రకటించనున్నారు.
గ్రామీణ పేదలను విడతల వారీగా స్వయం సహాయక సంఘాల్లో భాగం చేయడమే దీన్‌దయాల్ అంత్యోదయ యోజన లక్ష్యం అని ప్రధాని కార్యాలయం పేర్కొంది.
ఇదీ చదవండి :వెంకయ్య తీవ్ర భావోద్వేగం- ఎంపీల తీరుపై ఆవేదన