తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రూ.1,100 కోట్ల విలువైన ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన - Gandhinagar railway station redevelopment progress

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్​లో రూ. 1,100 కోట్ల విలువైన పలు కీలక ప్రాజెక్టులకు శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం వాటిని జాతికి అంకితం ఇవ్వనున్నాను. గాంధీనగర్​లో ఇటీవల నిర్మించిన రైల్వేస్టేషన్​ హోటల్​ను వర్చువల్​ విధానంలో ప్రారంభించనున్నారు.

narendra nodi
నరేంద్ర మోదీ

By

Published : Jul 16, 2021, 5:31 AM IST

Updated : Jul 16, 2021, 9:37 AM IST

గుజరాత్​లో పలు కీలక ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోదీ నేడు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం వాటిని జాతికి అంకితం ఇవ్వనున్నారు. వీటి మొత్తం విలువ సుమారు రూ. 1,100 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు.

దేశంలోనే తొలిసారిగా అత్యాధునిక హంగులతో అధునీకరించిన గుజరాత్‌లోని గాంధీనగర్‌ రైల్వేస్టేషన్‌ను శుక్రవారం ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ప్రపంచస్థాయి ప్రయాణికులకు సదుపాయాలను ఏర్పాటు చేయడంతోపాటు రైల్వేస్టేషన్‌పై 5 నక్షత్రాల హోటల్ నిర్మాణం చేపట్టారు. గాంధీనగర్‌ రైల్వేస్టేషన్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ కంపెనీ, గుజరాత్‌ ప్రభుత్వం, భారత రైల్వే స్టేషన్‌ అభివృద్ధి కార్పొరేషన్ సంయుక్తంగా ఈ ఆధునీకరణ పనులు చేపట్టాయి. దీనికోసం 71.50కోట్లు వ్యయం చేశారు. రైల్వేస్టేషన్‌ ప్రవేశం, బయటకు వెళ్లే మార్గాల చుట్టూ అందంగా ముస్తాబు చేశారు.

163 కార్లు, 40 ఆటోలు, 120 ద్విచక్రవాహనాలు పార్కు చేసే సదుపాయం ఉంది. రైల్వేస్టేషన్‌లోని మూడు ప్లాట్‌ఫారాలను 2 సబ్‌వేలతో అనుసంధానించారు. ప్లాట్‌ఫారాలపై 480 మంది ప్రయాణికుల సామర్థ్యంతో నిరీక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. విశాలమైన టికెట్‌ కౌంటర్లు, దివ్యాంగుల కోసం ప్రత్యేక టికెట్‌ కౌంటర్లు నిర్మించారు.

ఇదీ చూడండి:రైల్వేస్టేషన్ కమ్ 5స్టార్ హోటల్​ విశేషాలివే..

Last Updated : Jul 16, 2021, 9:37 AM IST

ABOUT THE AUTHOR

...view details