రక్షణ రంగంలో భవిష్యత్ సవాళ్లపై ప్రధాని నరేంద్ర మోదీ.. హోంమంత్రి అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహా దారు అజిత్ దోభాల్‌తో చర్చించారు. వరుస డ్రోన్ దాడులతో జమ్ముకశ్మీర్‌లో ఉద్రిక్తత పరిస్థితుల నెలకొన్న వేళ.. ప్రధాని మోదీ నివాసంలో ఈ భేటీ జరిగింది.
భద్రతా దళాలకు అధునాతన రక్షణ పరికరాల అందజేత, నూతన నియామకాల ద్వారా సైన్యం పెంపు, రక్షణ రంగంలో అంకుర పరిశ్రమల స్థాపన, భవిష్యత్ వ్యూహాల గురించి చర్చించినట్లు తెలుస్తోంది. జమ్ముకశ్మీర్‌లో డ్రోన్ దాడుల ముప్పు నేపథ్యంలో ఈ భేటీ జరిగినట్లు సమాచారం.