గుజరాత్‌లోని కేవడియాలో జరుగుతున్న దేశ భద్రతా దళాల అధిపతుల సమావేశంలో శనివారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. తొలిసారి ఈ సదస్సుకు జవాన్లు, జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్లు హాజరవుతున్నారు. సిబ్బంది సమస్యలకు సంబంధించిన కొన్ని ప్రత్యేక సెషన్లలో మాత్రమే వీరు పాల్గొంటారని అధికారులు తెలిపారు.
భద్రతా దళాల అధినేతల సదస్సుకు మోదీ - గుజరాత్
గుజరాత్లో జరుగుతున్న దేశ భద్రతా దళాల అధిపతుల సమావేశంలోప్రధాని నరేంద్ర మోదీ శనివారం నాడు ప్రసంగించనున్నారు. తొలిసారి ఈ సదస్సులో జవాన్లూ పాల్గొంటున్నారు.
సంయుక్త కమాండర్ల సదస్సులో మార్చి6న మోదీ ప్రసంగం
తీవ్ర ఉద్రిక్తతల అనంతరం భారత్, చైనా సైనిక బలగాల ఉపసంహరణ చేపడుతున్న క్రమంలో కేవడియాలో గురువారం మొదలైన 3 రోజుల సదస్సుకు ప్రాధాన్యం ఏర్పడింది. దేశ త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్, సైన్యాధిపతి జనరల్ ఎమ్ఎమ్ నరవణే, వైమానిక దళాధిపతి మార్షల్ ఆర్కేఎస్ భదౌరియా, నావిక దళాధిపతి అడ్మిరల్ కరంబీర్ సింగ్, రక్షణ శాఖ అధికారులు, జవాన్లు ఈ సదస్సులో పాల్గొంటున్నారు.
ఇదీ చూడండి:తాజ్‌మహల్‌కు బాంబు బెదిరింపు వారి పనే!