తెలంగాణ

telangana

By

Published : Mar 2, 2021, 3:51 PM IST

ETV Bharat / bharat

బంగాల్​లో 20, అసోంలో 6 భారీ ర్యాలీలకు మోదీ!

అసెంబ్లీ ఎన్నికలు త్వరలోనే జరగనున్న తరుణంలో బంగాల్​, అసోంలపై భాజపా మరింత దృష్టి సారించింది. ఈమేరకు బంగాల్​లో 20, అసోంలో 6 ర్యాలీలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని రప్పించాలని చూస్తోంది.

PM to address 20 rallies in West Bengal, 6 in Assam
బంగాల్​లో 20, అసోంలో 6 భారీ ర్యాలీలకు మోదీ హాజరు!

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. బంగాల్​లో 20 ర్యాలీలు, అసోంలో 6 బహిరంగ సభలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు రాష్ట్రాల్లోని భాజపా నేతల కోరిక మేరకు పలు ర్యాలీలకు మోదీ వస్తారని సమాచారం.

బంగాల్​లోని 23 జిల్లాలు, అసోంలోని 33 జిల్లాలవ్యాప్తంగా ఈ ర్యాలీలు నిర్వహించేందుకు భాజపా వ్యూహరచన చేస్తోంది. "ఎన్నికలు జరగనున్న అన్ని రాష్ట్రాల్లో ప్రధాని పర్యటించాల్సి ఉంది. కానీ.. బంగాల్, అసోంలపై భాజపా మరింత దృష్టి పెట్టింది." అని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

ఈ మేరకు మార్చి 7న కోల్​కతా బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్​లో జరగనున్న భారీ ర్యాలీ కోసం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎన్నికల నేపథ్యంలో.. బంగాల్​లో మోదీ హాజరుకానున్న మొదటి ర్యాలీ ఇదే కానుంది.

ముందస్తు చర్చలు..

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, పార్టీ కార్యకలాపాల గురించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చర్చించనున్నారు. బంగాల్​లోని భాజపా కార్యనిర్వాహక బృందం ఆధ్వర్యంలో బుధవారం ఈ సమావేశం జరగనుంది.

మార్చి 27 నుంచి ఏప్రిల్ 29 వరకు 8 దశల్లో బంగాల్​ ఎన్నికలు జరగనున్నాయి. మే 2న ఫలితాలు రానున్నాయి.

అసోంలో మార్చి 27 నుంచి ఏప్రిల్ 6 వరకు 3 దశల్లో పోలింగ్​ నిర్వహించనుంది ఎన్నికల సంఘం.

ఇదీ చదవండి:కేరళను మళ్లీ పట్టేస్తారా? బంగాల్​లో పోటీ ఇస్తారా?

ABOUT THE AUTHOR

...view details