తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తౌక్టే తుపాను సహాయక చర్యలపై మోదీ ఆరా

తౌక్టే తుపాను నేపథ్యంలో రాష్ట్రాలు చేపడుతున్న సహాయక చర్యలపై ఉన్నతస్థాయి అధికారులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమీక్ష నిర్వహించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

PM review
మోదీ సమీక్ష

By

Published : May 15, 2021, 8:30 PM IST

తౌక్టే తుపాను పరిస్థితులపై అధికారులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రాలు చేపడుతున్న సహాయక చర్యలపై ఆరా తీశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

అత్యవసర సేవలపై నిరంతరం నిఘా ఉంచాలని మోదీ సూచించారు. విద్యుత్, ఆరోగ్యం, తాగునీరు వంటి సమస్యలను తలెత్తకుండా చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సహా ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఆస్పత్రుల్లో కొవిడ్​ నిర్వహణ, వ్యాక్సిన్​ కోల్డ్​ చైన్, ఇతర వైద్య సదుపాయాలు, అత్యవసర ఔషధాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మోదీ ఆదేశించారు. ​ఆక్సిజన్​ సరఫరాకు ఆటంకం లేకుండా చూడాలని తెలిపారు. 24 గంటలపాటు కంట్రోల్​ రూం సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.

ఇదీ చూడండి:భారత్​కు 5కోట్ల వ్యాక్సిన్ డోసులు?

ABOUT THE AUTHOR

...view details