తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మరో రెండు గ్రామాలను దత్తత తీసుకోనున్న మోదీ! - ఆదర్శ గ్రామ యోజన

ప్రధాని నరేంద్ర మోదీ తన పార్లమెంట్​ నియోజకవర్గమైన వారణాసిలోని రెండు​ గ్రామాలను ఆదర్శ్​ గ్రామ యోజన కింద దత్తత తీసుకోనున్నారు. కరోనా సంక్షోభం కారణంగా గతేడాది ఆదర్శ గ్రామాలను ఎంపిక చేయనందున ఈ సారి రెండు గ్రామాలను స్వీకరించనున్నారు.

pm modi will adopt two villages of varanasi
మరో రెండు గ్రామాలను దత్తత తీసుకోనున్న మోదీ!

By

Published : Feb 15, 2021, 8:53 PM IST

సాంసద్​ ఆదర్శ్​ గ్రామ యోజన కింద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన నియోజక వర్గం వారణాసిలోని బియార్‌పూర్, పర్హంపూర్ అనే రెండు గ్రామాలను దత్తత తీసుకోకున్నారు. ఈ మేరకు అధికారిక వర్గాలు సోమవారం వెల్లడించాయి. గతంలో ఇదే తరహాలో నాలుగు గ్రామాలను(జయపుర్​, నాగ్​పుర్​, కాక్రాహియా, డోమరి) స్వీకరించిన మోదీ.. వాటిని అభివృద్ధి చేశారు.

కరోనా సంక్షోభం కారణంగా గతేడాది ఆదర్శ గ్రామాలను ఎంపిక చేయలేదు. ఈ సంవత్సరం ఒకేసారి రెండు గ్రామాల బాధ్యతల్ని మోదీ చూసుకోనున్నట్టు సమాచారం. ఈ విషయమై ప్రధాని కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ.. త్వరలోనే సంబంధిత జిల్లా అధికారులకు ప్రతిపాదనలు పంపనున్నట్టు తెలుస్తోంది.

ఇదీ చదవండి:ఎడతెగని ఎదురుచూపులు- ఆవిరవుతున్న ఆశలు

ABOUT THE AUTHOR

...view details