దిల్లీలోని కాగ్ కార్యాలయంలో నిర్వహించిన తొలి 'ఆడిట్ దివస్'లో(audit diwas) ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. తొలిసారి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు కాగ్‌కు అభినందనలు తెలిపారు(audit diwas 2021 ).
" కొన్ని సంస్థలు కాలక్రమేణా మరిత బలంగా తయారవుతాయి. పరిణితి చెందుతాయి. చాలా సంస్థలు దశాబ్దాల తర్వాత ఔచిత్వాన్ని కోల్పోతాయి. కానీ కాగ్ అలా కాదు. ఇది వారసత్వం. ప్రతి తరం కాగ్‌ను గుర్తు చేసుకోవాలి. ఇది పెద్ద బాధ్యత. ఒకప్పుడు ఆడిట్ అంటే అనుమానం, భయం ఉండేది. కాగ్‌కు, ప్రభుత్వానికి పడదనే ఆలోచన మన వ్యవస్థలో సాధారణమైంది. కాగ్ అన్నింటిలో తప్పులు వెతుకుతుందని ప్రభుత్వ అధికారులు అనుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఇప్పుడు ఆడిట్ అనేది వ్యాల్యూ ఎడిషన్‌లో ముఖ్యమైన భాగమైంది. ప్రభుత్వ పనిని అంచనా వేసేందుకు కాగ్ బయటి కోణంలో ఆలోచిస్తుంది. మీరు మాకు ఏది చెప్పినా వ్యవస్థాపరంగా మెరుగుపరుస్తాం. దాన్ని సహకారంగా భావిస్తాం. గతంలో బ్యాంకింగ్ వ్యవస్థలో సరైన పారదర్శకత లేని కారణంగా ఎన్నో అవకతవకలు జరిగాయి. "
--ప్రధాని మోదీ.
డేటాతో చరిత్ర