తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Vaccine For Children: వ్యాక్సినేషన్​పై ప్రధాని మోదీ కీలక ప్రకటన - bharat biotech covaxin

PM Narendra Modi addressed the nation at 9.45 pm
PM Narendra Modi addressed the nation at 9.45 pm

By

Published : Dec 25, 2021, 9:42 PM IST

Updated : Dec 25, 2021, 10:36 PM IST

22:33 December 25

జనవరి 3 నుంచి వారికి వ్యాక్సిన్​..

PM Narendra Modi: ఒమిక్రాన్‌ వేరియంట్‌ భయపెడుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. జనవరి 10వ తేదీ నుంచి హెల్త్‌కేర్‌, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు బూస్టర్‌ డోసు అందిస్తామని ప్రకటించారు. 15 నుంచి 18 ఏళ్ల వయసు వారికి జనవరి 3 నుంచి టీకా పంపిణీ చేస్తామని చెప్పారు.

అలాగే, జనవరి 10 నుంచే 60ఏళ్లు పైబడిన వృద్ధులందరికీ వైద్యుల సలహా మేరకు బూస్టర్‌ డోసు వేస్తామన్నారు.

శనివారం రాత్రి ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ''దేశంలో 90 శాతం వయోజనులకు కొవిడ్ టీకా తొలి డోసు పంపిణీ పూర్తయింది. ఒమిక్రాన్‌పై రకరకాల వార్తలు, వదంతులు వస్తున్నాయి. వ్యాక్సిన్‌ తయారీ, పంపిణీ కోసం నిరంతరం పనిచేస్తున్నాం. ఆరోగ్య కార్యకర్తల అంకితభావం వల్లే టీకా పంపిణీ వడివడిగా సాగుతోంది. రానున్న రోజుల్లో వ్యాక్సినేషన్‌ను మరింత వేగవంతం చేస్తాం'' అని మోదీ అన్నారు.

21:57 December 25

జనవరి 3 నుంచి వారికి వ్యాక్సిన్​..

జనవరి 3 నుంచి పిల్లలకు కొవిడ్​ టీకా ఇవ్వనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. 15 -18 ఏళ్ల వయసు వారికి వ్యాక్సిన్​ అందనున్నట్లు పేర్కొన్నారు.

జనవరి 10 నుంచి ఆరోగ్య కార్యకర్తలకు బూస్టర్​ డోసు అందుబాటులోకి రానున్నట్లు చెప్పారు.

21:48 December 25

'ఒమిక్రాన్‌ నివారణకు టీకా, జాగ్రత్తలే మందు'

మనమంతా అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది: ప్రధాని

కొత్త వేరియంట్​ ఒమిక్రాన్​ వల్ల ప్రపంచవ్యాప్తంగా కేసులు పెరిగిపోతున్నాయి: ప్రధాని

ఒమిక్రాన్‌ వస్తోందని ప్రజలు ఎవరూ భయాందోళనకు గురికావొద్దు: ప్రధాని

మాస్కులు ధరిస్తూ, శానిటైజ్​ చేసుకుంటూ ఉండండి: ప్రధాని

ఇవాళ దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లో 18 లక్షల ఐసోలేషన్​ పడకలు ఉన్నాయి: ప్రధాని

5 లక్షల ఆక్సిజన్​ పడకలు సిద్ధంగా ఉన్నాయి: ప్రధాని

కోటీ 40 లక్షల ఐసీయూ బెడ్లు ఉన్నాయి.: ప్రధాని

చిన్నారుల కోసం 90 వేల పడకలు సిద్ధంగా ఉన్నాయి: ప్రధాని

ఒమిక్రాన్‌ నివారణకు టీకా, జాగ్రత్తలే మందు: ప్రధాని

అనేక రాష్ట్రాల్లో వందశాతం కరోనా వ్యాక్సినేషన్ పూర్తయ్యింది

వైద్యసిబ్బంది కఠోరశ్రమ వల్లే వందశాతం వ్యాక్సినేషన్‌ సాధ్యమైంది

11 నెలలుగా దేశంలో వ్యాక్సినేషన్ ఉద్యమం కొనసాగుతోంది

అనేక దేశాలతో పోలిస్తే వ్యాక్సినేషన్‌లో మన దేశం ముందుంది

కరోనా భయం ఇంకా పూర్తిగా పోలేదని గుర్తించాలి

దేశంలోని 90 శాతం వయోజనులకు కొవిడ్‌ టీకా మొదటి డోసు పంపిణీ పూర్తయింది

ఒమిక్రాన్‌పై రకరకాల వార్తలు, వదంతులు వస్తున్నాయి

21:45 December 25

జాతిని ఉద్దేశించి మోదీ ప్రసంగం..

ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు.

21:39 December 25

Vaccine For Children: వ్యాక్సినేషన్​పై ప్రధాని మోదీ కీలక ప్రకటన

PM Narendra Modi: ప్రధాని నరేంద్ర మోదీ కాసేపట్లో జాతిని ఉద్దేశించి ప్రసగించనున్నారు.

దేశంలో ఒమిక్రాన్​ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని ఏం మాట్లాడతారని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

భారత్​ బయోటెక్​ పిల్లల కొవిడ్​ టీకా కొవాగ్జిన్​కు డీసీజీఐ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో మోదీ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.

Last Updated : Dec 25, 2021, 10:36 PM IST

ABOUT THE AUTHOR

...view details