తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆగ్రా మెట్రో ప్రాజెక్టును ప్రారంభించనున్న మోదీ

ఉత్తర్​ప్రదేశ్​ ఆగ్రాలో మెట్రో ప్రాజెక్టు నిర్మాణాన్ని సోమవారం ప్రారంభించనున్నారు ప్రధాని మోదీ. ఉదయం 11:30 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో వర్చువల్​గా పాల్గొననున్నారు. యూపీ ప్రధాన పర్యటక కేంద్రాలైన తాజ్​మహల్​, ఆగ్రా కోట, సికంద్రలను రైల్వే స్టేషన్లు, బస్టాండ్లకు అనుసంధానించడమే లక్ష్యంగా రూ.8,380 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపడుతోంది యోగి సర్కార్​.

PM Modi to virtually inaugurate construction of Agra metro project on Monday
ఆగ్రా మెట్రో ప్రాజెక్టును ప్రారంభించనున్న మోదీ

By

Published : Dec 7, 2020, 5:16 AM IST

ఉత్తర్​ప్రదేశ్ ఆగ్రాలో మెట్రో ప్రాజెక్టు నిర్మాణ పనులను సోమవారం వర్చువల్​గా ప్రారంభించనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఉదయం 11:30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఆగ్రాలోని 15వ బెటాలియన్​ పీఏసీ పరేడ్ గ్రౌండ్​లో జరిగే ఈ ప్రారంభోత్సవంలో కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్​దీప్​ సింగ్​ పూరి, ఉత్తర్​ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ పాల్గొననున్నారు.

ఆగ్రా మెట్రో ప్రాజెక్టు

రెండు కారిడార్లు, 29.4 కిలోమీటర్ల పొడవుతో ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు. యూపీలో ప్రధాన పర్యటక కేంద్రాలైన తాజ్​మహల్​, ఆగ్రా కోట, సికంద్రాలను రైల్వే స్టేషన్లు, బస్​ స్టేషన్లకు అనుసంధానించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును చేపడుతోంది యూపీ ప్రభుత్వం. దీని ద్వారా ఆగ్రాలోని 26లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది. ఏటా నగరానికి వచ్చే 60లక్షల మంది పర్యటకులకు మెట్రో సేవలు అందుబాటులోకి వస్తాయి.

ఆగ్రా మెట్రో ప్రాజెక్టు

రూ.8,380 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఆగ్రా మెట్రో ప్రాజెక్టు నిర్మాణాన్ని ఐదేళ్లలో పూర్తి చేయనున్నారు.

ఇదీ చూడండి: టీకా ముందు మాకే ఇవ్వండి: మోదీకి సీఎం లేఖ

ABOUT THE AUTHOR

...view details