తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ రాష్ట్రానికే కేంద్ర మంత్రివర్గ విస్తరణలో పెద్దపీట!

ఒకటిరెండు రోజుల్లోనే ప్రధాని మోదీ కేంద్రం మంత్రివర్గ విస్తరణను చేపట్టవచ్చని సమాచారం. నూతన మంత్రివర్గంలో ఉత్తర్​ప్రదేశ్​కు కీలక ప్రాధాన్యం ఉంటుందని తెలుస్తోంది. ఆ రాష్ట్రం నుంచి వరుణ్​ గాంధీ, రాంశంకర్‌ కథేరియా, అనిల్‌ జైన్‌, రీటా బహుగుణ జోషి, జాఫర్‌ ఇస్లాం పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.

modi cabinet expansion, cabinet reshuffle pm modi
నేడో రేపో కేంద్ర మంత్రివర్గ విస్తరణ!

By

Published : Jul 2, 2021, 6:48 AM IST

కేంద్ర మంత్రివర్గ విస్తరణను ప్రధాని నరేంద్ర మోదీ ఒకటిరెండు రోజుల్లోనే చేపట్టవచ్చని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీనిపై కసరత్తు పూర్తయినట్లు సమాచారం. శాఖల పనితీరును మదింపు చేసిన అనంతరం ప్రధాని తుది జాబితాను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. కొత్తగా మంత్రివర్గంలో చోటు దక్కేవారిలో జ్యోతిరాదిత్య సింధియా (మధ్యప్రదేశ్‌), శర్వానంద్‌ సోనోవాల్‌ (అస్సాం)లతో పాటు బిహార్‌ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్‌ మోదీల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. బిహార్‌, గుజరాత్‌ల ఇన్‌ఛార్జిగా ఉన్న భాజపా సీనియర్‌ నేత భూపేంద్ర యాదవ్‌కు కూడా చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఉత్తర్‌ప్రదేశ్‌కు కీలక ప్రాధాన్యం ఉంటుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఆ రాష్ట్రం నుంచి వరుణ్‌ గాంధీ, రాంశంకర్‌ కథేరియా, అనిల్‌ జైన్‌, రీటా బహుగుణ జోషి, జాఫర్‌ ఇస్లాంల పేర్లు వినిపిస్తున్నాయి. పశ్చిమబెంగాల్‌ నుంచి జగన్నాథ్‌ సర్కార్‌, శంతను ఠాకూర్‌, నీతీట్‌ ప్రామాణిక్‌లకు; ఉత్తరాఖండ్‌ నుంచి అజయ్‌ భట్‌, అనిల్‌ బలూనీల్లో ఒకరికి; కర్ణాటక నుంచి ప్రతాప్‌ సిన్హాకు కూడా అవకాశం దక్కొచ్చని సమాచారం. అశ్వనీ వైష్ణవ్‌ లేదా బైజయంత్‌ పాండా (ఒడిశా), బ్రిజేంద్ర సింగ్‌ (హరియాణా), రాహుల్‌ కస్వాన్‌ (రాజస్థాన్‌), పర్వేశ్‌ వర్మ లేదా మీనాక్షి లేఖి (దిల్లీ)లకు కూడా చోటు కల్పించవచ్చని తెలుస్తోంది. మహారాష్ట్ర నుంచి నారాయణ్‌ రాణె, ఉదయన్‌రాజే భోస్లేలతో పాటు పూనమ్‌ మహాజన్‌ లేదా ప్రీతమ్‌ ముండేల్లో ఒకరిని తీసుకునే అవకాశం ఉంది. మిత్రపక్షాల్లో.. పశుపతి పరాస్‌ (లోక్‌ జన్‌శక్తిలో చీలిక తెచ్చిన నేత), అప్నాదళ్‌ నేత అనుప్రియ పటేల్‌ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. జేడీయూ నుంచి లల్లాన్‌ సింగ్‌, రామ్‌నాథ్‌ ఠాకూర్‌, సంతోష్‌ కుశ్వాహాలకు అవకాశం దక్కవచ్చని తెలుస్తోంది.

ఇదీ చదవండి :మోదీ కేబినెట్​లోకి 27 మంది కొత్త నేతలు!

ABOUT THE AUTHOR

...view details