ఐక్యరాజ్యసమితి భద్రత మండలిలో(యూఎన్ఎస్సీ) సముద్ర భద్రతపై ఆగస్టు 9న జరగనున్న బహిరంగ చర్చకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వం వహించనున్నారు. యూన్ఎస్సీలో వర్చువల్గా జరగనున్న చర్చకు తొలిసారిగా భారత ప్రధాని అధ్యక్షత వహించనున్నట్లు విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ట్విట్టర్ వేదికగా తెలిపారు.
"ఐరాస భద్రత మండలిలో ఆగస్టు 9న 'అంతర్జాతీయ భద్రత, శాంతి నిర్వహణ: సముద్ర భద్రత' అనే అంశంపై బహిరంగ చర్చ జరగనుంది. వర్చువల్గా జరగనున్న ఈ చర్చకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత వహించనున్నారు. బహిరంగ చర్చకు భారత ప్రధాని అధ్యక్షత వహించడం ఇదే తొలిసారి కానుంది."