తెలంగాణ

telangana

ETV Bharat / bharat

157 పురాతన కళాఖండాలతో అమెరికా నుంచి భారత్​కు మోదీ - మోదీ అమెరికా వార్తలు

పురాతన కళాఖండాలు, వస్తువులను భారత్​కు (India Artefacts) అప్పగించింది అమెరికా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) పర్యటనలో భాగంగా మొత్తం 157 వస్తువులను భారత్​కు అందించింది. క్రీస్తు పూర్వానికి చెందిన కొన్ని వస్తువులు ఈ కళాఖండాల్లో ఉన్నాయి. అమెరికా పర్యటనను ముగించుకున్న ప్రధాని మోదీ (Modi US tour 2021).. వీటిని తీసుకొని భారత్​కు బయల్దేరారు.

PM-US-ARTEFACTS
PM-US-ARTEFACTS

By

Published : Sep 25, 2021, 10:26 PM IST

భారత్​కు చెందిన 157 అత్యంత పురాతన కళాఖండాలను (India Artefacts) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వదేశానికి తీసుకురానున్నారు. అమెరికాలో ఉన్న ఈ కళాఖండాలను అక్కడి సాంస్కృతిక శాఖ భారత్​కు అప్పగించింది. మోదీ పర్యటనలో భాగంగా వీటిని భారత్​కు అందించింది. అమెరికా పర్యటనను (Modi US tour 2021) ముగించుకున్న ప్రధాని మోదీ (PM Modi).. వీటిని తీసుకొని భారత్​కు బయల్దేరారు.

.
కార్నర్ స్టోన్​ మీద ఇద్దరు పురుషుల ఆకారాలు

ఈ కళాఖండాల్లో క్రీస్తు శకం 10వ శతాబ్దానికి చెందిన విగ్రహాలు, 12వ శతాబ్దానికి చెందిన రాగి నటరాజ విగ్రహం వంటివి ఉన్నాయి. చాలా వరకు కళాఖండాలు 11 నుంచి 14వ శతాబ్దానికి చెందినవే. 45 కళాఖండాలు మాత్రం క్రీస్తు పూర్వానికి చెందినవి ఉన్నట్లు తెలుస్తోంది. సగం కళాఖండాలు సంస్కృతికి సంబంధించినవి కాగా మిగిలినవి హిందూ, బౌద్ధం, జైన మతాలకు చెందినవి ఉన్నాయి.

ముగ్గురు తీర్థకరులను ప్రతిబింబించే కళాఖండం
రాగి బౌద్ధ విగ్రహం

వీటిని భారత్​కు అందించడాన్ని మోదీ స్వాగతించారు. ఈ సందర్భంగా ప్రధాని వారికి కృతజ్ఞతలు తెలిపారు. అక్రమ మార్గాల్లో సాంస్కృతిక వస్తువులను తరలించకుండా చర్యలు బలోపేతం చేయాలని ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు నిర్ణయించారని అధికారులు తెలిపారు. భారత్​కు చెందిన పురాతన వస్తువులను, కళాఖండాలను తిరిగి స్వదేశానికి తీసుకొచ్చే కార్యక్రమాన్ని మోదీ ప్రభుత్వం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. (Modi US tour 2021)

బుద్ధ విగ్రహం
కళాఖండాలను పరిశీలిస్తున్న మోదీ

ఇదీ చదవండి:'భారత్​లో సంస్కరణలతో ప్రపంచం రూపాంతరం'

ABOUT THE AUTHOR

...view details