గుజరాత్లో పండిత్ దీన్దయాల్ పెట్రోలియం విశ్వవిద్యాలయం(పీడీపీయూ) 8వ స్నాతకోత్సవ వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీ శనివారం హాజరుకానున్నారు. గాంధీనగర్లో జరిగే ఈ కార్యక్రమంలో వర్చువల్గా పాల్గొననున్నట్టు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు మోదీ.
"గాంధీనగర్ పీడీపీయూలో శనివారం ఉదయం 11గంటలకు జరిగే స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొంటాను. అంతేకాకుండా.. విశ్వవిద్యాలయంలో పరిశోధన, ఆవిష్కరణలను మెరుగుపరిచేందుకు ఏర్పాటు చేసిన కేంద్రాలను ప్రారంభిస్తాను."